Kidney health : కిడ్నీలో 10 మి.మీ. కంటే పెద్ద రాళ్లను ఎలా తొలగిస్తారు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కిడ్నీ రాళ్ల పరిమాణం 4 నుంచి 10 మి.మీ. మధ్య ఉన్నప్పుడు అవి సహజంగా బయటికి వెళ్లే అవకాశం ఉండక పోవచ్చు. ఫ్లాంక్ పెయిన్ అంటే మూత్రపిండాల నొప్పి, వికారం, వాంతులు, మూత్రంలో రక్తం వంటి లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ దశలో రాయి బయటికి రాకపోతే ఇన్ఫెక్షన్, యూరిన్ కు అడ్డు పడటం వంటి సమస్యలు తలెత్తితే లితోట్రిప్సి (Lithotripsy) లేదా యుటెరోస్కోపి (Ureteroscopy) వంటి తక్కువ కోతతో చేసే ప్రొసీజర్లు చేయాల్సి వస్తుంది. ఇక 10 మి.మీ. కంటే పెద్ద రాళ్లు సరైన చికిత్స లేకుండా బయటికి రావడం దాదాపు అసాధ్యం. వీటికి సర్జరీ ద్వారానే తొలగించాల్సి ఉంటుంది.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

బాధితుల్లో తీవ్రమైన నొప్పి, పదేపదే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు (UTI), మూత్రంలో స్పష్టంగా రక్తం కనిపిస్తాయి. ఇలాంటి వాటికి 'పర్క్యూటేనియస్ నెఫ్రోలిథోటమీ' (PCNL) వంటి అధునాతన పద్ధతులను వైద్యులు ఎక్కువగా సిఫార్సు చేస్తుంటారు" అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

గర్భిణీ స్త్రీలలో కిడ్నీ రాళ్ల చికిత్స ఎలా ఉంటుంది..?

అమెరికన్ యురోలాజికల్ అసోసియేషన్ (AUA) గర్భిణీలలో కిడ్నీ రాళ్ల చికిత్సకు సంబంధించి కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసింది. కిడ్నీ రాళ్లను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ పరీక్షను మొదటి ఎంపికగా పరిగణిస్తారు. అవసరమైతే నాన్-కాంట్రాస్ట్ MRI లేదా CT స్క్యాన్‌లను ప్రత్యామ్నాయాలుగా ఉపయోగిస్తారు. గర్భిణీ మహిళలు తీసుకునే అన్ని రకాల మందులు, సర్జికల్ చికిత్సలు తప్పనిసరిగా నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలోనే అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలి.

వేచి ఉండే పద్ధతి.. కిడ్నీ రాయికి సంబంధించిన లక్షణాలు నియంత్రణలోనే ఉంటే, ఆ రాయి తనంతట తానుగా బయటికి వస్తుందేమోనని డాక్టర్లు కొంతకాలం వేచి చూసే ధోరణిని అనుసరిస్తారు. తొలగింపు ప్రక్రియ..రాయి సహజంగా బయటికి రాకపోతే, దానిని భౌతికంగా తొలగించడానికి 'యుటెరోస్కోపి' (Ureteroscopy) ప్రక్రియను చేయాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయాలు.. గర్భిణీలకు డ్రైనేజ్ ట్యూబ్,స్టెంట్ లేదా  నెఫ్రోస్టోమీ ట్యూబ్ అమర్చడం మరొక మార్గం. అయితే గర్భధారణ సమయంలో వీటిని తరచుగా మారుస్తూ ఉండాల్సి వస్తుంది.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.