Kids : పిల్లలలో థైరాయిడ్ కు కారణాలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : ఇటీవల చాలా మంది చిన్నారుల్లో థైరాయిడ్ సమస్య పుట్టుకతోనే వస్తోంది. అంతే కాకుండా బిడ్డ నెలలు నిండకుండా పుడితే కూడా కొందరిలో థైరాయిడ్ సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను నివారించడానికి, తల్లి గర్భం నుండే బిడ్డకు సరైన పోషకాహారాన్ని అందించాలి.
ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు
హషిమోటో థైరాయిడిటిస్ వంటి ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా థైరాయిడ్‌కు కారణం కావచ్చు. అయోడిన్ లోపం వల్ల కూడా థైరాయిడ్ ప్రోబ్లమ్స్ తలెత్తుతాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఆటోఇమ్యూన్ డిసీజ్ అనేది శరీరం రోగనిరోధక వ్యవస్థ థైరాయిడ్ గ్రంధిని దెబ్బతీయడం ప్రారంభించే పరిస్థితి. తల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డకు సరైన పోషకాహారం అందకపోతే థైరాయిడ్ సమస్యలు రావచ్చు.
పిల్లలలో థైరాయిడ్ వ్యాధి లక్షణాలు..
- పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల తగ్గుతుంది
-పిల్లలు అలసిపోయినట్లు అనిపిస్తుంది
-త్వరగా అనారోగ్యానికి గురవుతారు
- పిల్లల చర్మం పొడిగా, నిర్జీవంగా కనిపిస్తుంది
ఎముకలు, జుట్టు, దంతాలు బలహీనమవుతాయి
-మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తుతాయి.
- ఊబకాయం సమస్య.
-థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం.
-కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా అనిపించడం.
థైరాయిడ్ నివారణ..
-మొదట పిల్లలలో థైరాయిడ్ లక్షణాలను గమనించిన వెంటనే తల్లిదండ్రులు ఖచ్చితంగా సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.
-హైపోథైరాయిడిజం ఉన్న పిల్లలకు, హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చికిత్స చేస్తారు. అంతే కాకుండా కొన్ని మందుల ద్వారా కూడా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
-హైపర్ థైరాయిడిజంతో బాధపడుతున్న పిల్లల చికిత్స కోసం, మందులు, శస్త్రచికిత్సలు చేస్తారు.
-థైరాయిడ్ కారణంగా పిల్లల శారీరకంగానే కాకుండా మానసిక ఎదుగుదలపై కూడా ప్రభా వం చూపిస్తుంది.
-దీన్ని నివారించాలంటే సరైన వైద్యంతో పాటు పౌష్టికాహారంపై కూడా శ్రద్ధ పెట్టాలి.
-పుట్టుకతో వచ్చే థైరాయిడ్ వ్యాధిని గుర్తించేందుకు, పుట్టిన కొద్ది రోజుల్లోనే పిల్లల టీ.ఎస్.హెచ్ పరీక్ష చేయించాలి.
ఇది కూడా చదవండి.. దేశంలో అవయవ దానం రేటు ప్రపంచంలోనే అతి తక్కువ.. ఎందుకంటే..?
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
