Protein : ప్రోటీన్ షేక్ తాగడం ఇష్టం లేదా..? అయితే ఈ మార్గాలు మీకోసమే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కండరాల బలోపేతానికి, దేహదారుఢ్యానికి 'ప్రోటీన్' అత్యంత కీలకమైన పోషకం. శరీరానికి అవసరమైన ప్రోటీన్ అందించేందుకు చాలామంది ప్రోటీన్ పౌడర్లను వాడుతుంటారు. అయితే, నీళ్లలో లేదా పాలలో కలుపుకుని తాగే 'ప్రోటీన్ షేక్' రుచి, దాని చిక్కదనం అందరికీ నచ్చకపోవచ్చు. ఆ ఫ్లేవర్ నచ్చని వారు, ప్రోటీన్ పౌడర్‌ను నేరుగా తాగకుండా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

1. పండ్ల స్మూతీల్లో కలుపుకుని..

ప్రోటీన్ షేక్ రుచి నచ్చని వారికి పండ్లతో చేసే స్మూతీలు బెస్ట్ ఆప్షన్. అరటిపండు, స్ట్రాబెర్రీ లేదా మీకు నచ్చిన పండ్లను పాలు లేదా ప్లాంట్ బేస్డ్ మిల్క్ తో కలిపి బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత అందులో తగినంత ప్రోటీన్ పౌడర్ వేసి మరోసారి బ్లెండ్ చేయాలి. పండ్ల సహజమైన రుచి, స్మూతీ క్రీమీ టెక్స్చర్ వల్ల ప్రోటీన్ పౌడర్ ఫ్లేవర్ పెద్దగా తెలియదు.

2. ఓట్స్‌తో అల్పాహారంగా..

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తినే అలవాటు ఉంటే, దాన్ని మరింత ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చు. ఓట్స్‌ను పాలు లేదా నీళ్లలో ఉడికించి కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత పౌడర్ వేసి, ఉండలు కట్టకుండా బాగా కలపాలి. దీనిపైన కొన్ని తాజా పండ్ల ముక్కలు, డ్రైఫ్రూట్స్, కాస్త దాల్చినచెక్క పొడి చల్లుకుంటే రుచితో పాటు అదనపు పోషకాలు అందుతాయి.

3. పెరుగుతో జోడించి..

ప్రోటీన్ పౌడర్‌ను పెరుగులో కలుపుకుని తినడం మరో సులభమైన పద్ధతి. తాజా సాదా పెరుగులో కొద్దిగా పౌడర్ వేసి బాగా కలపాలి. నచ్చితే పండ్ల ముక్కలు జతచేసుకోవచ్చు. అయితే మీరు వాడే ఫ్లేవర్డ్ పౌడర్లలో అప్పటికే స్వీట్నర్లు, చక్కెర ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి, తక్కువ మోతాదుతో ప్రారంభించడం మంచిది.

4. దోశల పిండిలో..

అల్పాహారంగా శెనగపిండి, పెసర పిండితో చేసే దోశ ఇష్టపడే వారు ఆ పిండిలో కొద్దిగా 'అన్-ఫ్లేవర్డ్' అంటే రుచి, వాసన లేని ప్రోటీన్ పౌడర్ కలుపుకోవచ్చు. అయితే పౌడర్ కలిపాక పిండి కాస్త గట్టిపడే అవకాశం ఉంది కాబట్టి, దానికి తగ్గట్టుగా నీరు లేదా పాలు కలుపుకుంటూ కన్సిస్టెన్సీని సెట్ చేసుకోవాలి.పౌడర్ కొనేముందు ప్యాకెట్ మీద ఉన్న లేబుల్ చదివి చక్కెర, స్వీట్నర్లు ఎంత శాతం ఉన్నాయో తప్పనిసరిగా గమనించాలి.

పాలు పడని వారు అంటే లాక్టోజ్ ఇన్టాలరెన్స్, ప్యాకెట్ వెనక ఉన్న ఇంగ్రిడియంట్స్ చూసుకుని ప్లాంట్ బేస్డ్ పౌడర్లను ఎంచుకోవాలి. కేవలం సప్లిమెంట్లపైనే ఆధారపడకుండా పప్పులు, పాలు, పెరుగు, పన్నీర్, సోయా, గుడ్లు వంటి సహజసిద్ధమైన ఆహారం ద్వారా ప్రోటీన్ పొందేలా చూసుకోవాలి. కిడ్నీ సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఎలాంటి ప్రోటీన్ సప్లిమెంట్లు వాడకూడదు.

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.