ABC Juice : ఒకే గ్లాసులో మూడు సూపర్ ఫుడ్స్.. 'ఏబీసీ' జ్యూస్‌తో ఎన్నో లాభాలు..!
సాక్షి లైఫ్ : మంచి ఆరోగ్యానికి సమతుల్య ఆహారం ఎంతో ముఖ్యం. రోజూ పండ్లు, కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఈ కోవలో 'ఏబీసీ (ABC) జ్యూస్' ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఏబీసీ అంటే యాపిల్ (Apple), బీట్‌రూట్ (Beetroot), క్యారెట్ (Carrot). విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లతో నిండిన ఈ జ్యూస్‌ను మితంగా తీసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
యాపిల్..ఇందులో విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
బీట్‌రూట్..సహజసిద్ధమైన నైట్రేట్లు, ఫోలేట్ (Vitamin B9) ఉంటాయి.
క్యారెట్..బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్-A గా మారుతుంది.
ఏబీసీ జ్యూస్‌తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
రోగనిరోధక శక్తి పెరుగుదల.. యాపిల్, క్యారెట్‌లలో ఉండే పోషకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative stress) నుంచి కణాలను రక్షిస్తాయి.
గుండెకు రక్ష.. బీట్‌రూట్‌లోని సహజ నైట్రేట్లు శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి. ఇది రక్తనాళాలను విశాలం చేసి, రక్తపోటును (bp) నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కంటి చూపునకు మేలు..క్యారెట్లలో ఉండే బీటా కెరోటిన్.. శరీరంలో విటమిన్-ఎ గా మారుతుంది. కంటిచూపు మందగించకుండా, కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఇది చాలా అవసరం.
చర్మ సౌందర్యం..యాపిల్, బీట్‌రూట్, క్యారెట్లలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తాయి. దీనివల్ల చర్మం కాంతివంతంగా, యవ్వనంగా కనిపిస్తుంది. మెరుగైన జీర్ణక్రియ..యాపిల్‌లో 'పెక్టిన్' అనే కరిగే ఫైబర్ (fiber) ఉంటుంది. ఇది పేగుల్లోని మంచి బ్యాక్టీరియా వృద్ధికి తోడ్పడి జీర్ణక్రియను సులభతరం చేస్తుంది.
ఈ జ్యూస్ ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, తగిన మోతాదులోనే తీసుకోవాలి. పండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఉంటాయి కాబట్టి మధుమేహం (diabetes) ఉన్నవారు వైద్యులు లేదా డైటీషియన్ సలహా తీసుకున్నాకే తాగాలి. అలాగే జ్యూస్ చేసినప్పుడు కొంత ఫైబర్ పోతుంది. కాబట్టి, జ్యూస్‌ల రూపంలో కంటే ఈ మూడింటినీ నేరుగా ముక్కలుగా తినడం ద్వారా సంపూర్ణ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
