టెస్టోస్టెరాన్ లేకపోవడం వల్ల పురుషుల్లో కలిగే ప్రధాన సమస్య ఏమిటి..?  

షేర్ చేయండి:
టెస్టోస్టెరాన్ లేకపోవడం వల్ల పురుషుల్లో కలిగే ప్రధాన సమస్య ఏమిటి..?  

సాక్షి లైఫ్: స్త్రీలలో మెనోపాజ్ వచ్చినట్లే, పురుషులలో కూడా వస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. నిజానికి, మహిళలైనా, పురుషులైనా వారి వయస్సు పెరిగేకొద్దీ శరీరంలో అనేక రకాల మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులకు ప్రధాన కారణం టెస్టోస్టెరాన్ హార్మోన్ లేకపోవడమే. దీనిని "మేల్ మెనోపాజ్" అని, "ఆండ్రోపాజ్" అని కూడా అంటారు.

 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

సాధారణంగా ఈ సమస్య 50 సంవత్సరాల వయస్సు తర్వాత కనిపిస్తుంది. "మేల్ మెనోపాజ్" లక్షణాలు మన శారీరక, మానసిక, లైంగిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. పురుషులలో "మేల్ మెనోపాజ్" అంటే ఏమిటి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఆండ్రోజెన్ లోపం అంటే ఏమిటి..?

మేల్ మెనోపాజ్ ని ఆండ్రోపాజ్ అని కూడా అంటారు. వయస్సు పెరిగే కొద్దీ పురుషులలో టెస్టోస్టెరాన్ హార్మోన్ పరిమాణం తగ్గడం ప్రారంభమైనప్పుడు తలెత్తే ఒక పరిస్థితి. సాధారణంగా ఈ సమస్య 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో కనిపిస్తుంది. దీని లక్షణాలలో అలసట, నిద్రలేమి, మానసిక స్థితిలో మార్పులు, సంతానోత్పత్తిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపించవచ్చు. దీనిని టెస్టోస్టెరాన్ లోపం, ఆండ్రోజెన్ లోపం(ఏడిఏఎం) లేదా హైపోగోనాడిజం అని కూడా అంటారు.

 

ఇది కూడా చదవండి..వైద్యుల భరోసానే బాధితులకు ఔషధం.. 

 

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.