వర్షాకాల వ్యాధులపై అపోహలు - వాస్తవాలు..!

షేర్ చేయండి:
వర్షాకాల వ్యాధులపై అపోహలు - వాస్తవాలు..!

సాక్షి లైఫ్ : వర్షాకాలంలో వర్షాలు మొదలవ్వగానే వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, నీరసం వంటి సమస్యలు తలెత్తుతాయి. అనారోగ్యం బారిన పడినప్పుడు చాలా మంది మందులు వేసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో వండిన భోజనంపై దృష్టి సారించడం వంటివి చేస్తారు. కానీ, తరచుగా ఒక కీలకమైన అంశాన్ని మాత్రం విస్మరిస్తారు. ఈ అనారోగ్యాలు కేవలం అలసటనే కాకుండా, విరేచనాలు లేకపోయినా డీహైడ్రేషన్ (శరీరంలో నీటిశాతం తగ్గడం)కు దారితీసి, నీరసాన్ని కలిగిస్తాయి.

 

 ఇది కూడా చదవండి..కిడ్నీ క్యాన్సర్: ఎలా వస్తుంది? ప్రారంభ సంకేతాలు ఎలా ఉంటాయి..?

 ఇది కూడా చదవండి..పొత్తికడుపు లేదా పక్క భాగంలో కనిపించే ఏ లక్షణం కిడ్నీ క్యాన్సర్‌కు సూచన కావచ్చు?

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

డీహైడ్రేషన్ గురించి తమకు తెలుసని చాలా మంది భావించినప్పటికీ, వివిధ రకాల డీహైడ్రేషన్ గురించి పూర్తి అవగాహన లోపించిందని నిపుణులు చెబుతున్నారు. జ్వరాలు, డెంగ్యూ వంటి ఉష్ణమండల జ్వరాలు, జలుబు, దగ్గు వంటి సాధారణ అనారోగ్యాల సమయంలో కూడా డీహైడ్రేషన్ సమస్య తలెత్తవచ్చు. అయితే, ఈ సమస్యను పరిష్కరించడానికి సరైన హైడ్రేషన్ పద్ధతులపై అవగాహన లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని గ్యాస్ట్రోఇంటెస్టినల్ సర్జన్ డా. బి రవీందర్ రెడ్డి చెబుతున్నారు. 


అపోహ 1: డీహైడ్రేషన్‌కు నీరు తాగితే సరిపోతుంది..!

డీహైడ్రేషన్‌ను ఎదుర్కోవడానికి నీటిని తరచుగా ప్రధాన పరిష్కారంగా భావిస్తారు. అయితే, వాస్తవానికి, రోగులకు కేవలం నీరు మాత్రమే కాకుండా, ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, శక్తినిచ్చే ఆహారం వంటివి రికవరీ అవ్వడానికి అవసరం. వైరల్ జ్వరాల సమయంలో శరీరం నీటిని మాత్రమే కాదు, సోడియం, పొటాషియం వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లను కూడా కోల్పోతుంది.

 నీటితో ఇవి శరీరానికి అందవు. చాలా మంది నీరు, కొన్ని పండ్లు లేదా లస్సీ వంటి ఇంట్లో తయారుచేసిన పానీయాలు సరిపోతాయని అనుకుంటారు. ఇవి పాక్షికంగా సహాయపడినప్పటికీ, నిజంగా శరీరానికి అవసరమైన పోషకాలను అందించకపోతే కోలుకోవడం ఆలస్యం కావచ్చు.

సోడియం, పొటాషియం, క్లోరైడ్ వంటి ముఖ్యమైన ఎలక్ట్రోలైట్‌లు, సరైన మొత్తంలో శక్తి కలిగిన ద్రవాలను అందించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

అపోహ 2: దాహం, పెదవులు పొడిబారడం, డీహైడ్రేషన్‌కు స్పష్టమైన సంకేతాలు!

పగిలిన పెదవులు, పొడి చర్మం, నోరు ఎండిపోవడం, చిక్కగా వచ్చే మూత్రం డీహైడ్రేషన్ సంకేతాలని చాలా మంది భావిస్తారు. అయితే, వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలలో, డీహైడ్రేషన్ లక్షణాలు మరింత సూక్ష్మంగా ఉంటాయి. పిల్లలలో చిరాకు, పెద్దలలో అలసట, తిమ్మిర్లు లేదా సాధారణ బలహీనతగా ఇది కనిపించవచ్చు. దాహం వేస్తుందని వ్యక్తులు భావించే సమయానికి, శరీరంలో పోషకాల లోటు పెరిగి, అది మరింత డీహైడ్రేషన్‌కు కారణం కావచ్చు.

అపోహ 3: విరేచనాలు మాత్రమే డీహైడ్రేషన్‌కు దారితీస్తాయి..!

విరేచనాలు వచ్చినప్పుడు ఓరల్ రీహైడ్రేషన్ ద్రావణాలతో చురుకుగా రీహైడ్రేట్ చేసుకుంటారు. అయితే, వర్షాకాలంలో వచ్చే విరేచనాలు కాని అనారోగ్యాలు లేదా ఇన్ఫెక్షన్లు కూడా శరీరంలోని ద్రవం, ఎలక్ట్రోలైట్లు, శక్తి లోపించడం అసమతుల్యతకు కారణమవుతాయి. అటువంటి పరిస్థితిలో కేవలం నీరు లేదా ఓఆర్‌ఎస్ ద్రావణాలు మాత్రమే ద్రవాలు, ఎలక్ట్రోలైట్లు, శక్తిని పూర్తిగా పునరుద్ధరించలేవు. హైడ్రేషన్‌ను మెరుగుపరచడానికి, రెడీ-టు-సర్వ్ ఎలక్ట్రోలైట్ పానీయాలను తీసుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉన్నప్పుడు, జ్వరం ఉన్నా లేదా తక్కువ తింటున్నా, కోలుకోవడంలో ఆలస్యం అవుతున్నట్లు అనిపిస్తే, శరీరం చెప్పే సూచనలను గురించాలి. కేవలం హైడ్రేషన్ కోసం మాత్రమే కాకుండా, ద్రవ ఎలక్ట్రోలైట్లు లేదా శక్తినిచ్చేవి అవసరం. దీనిపై సరైన అవగాహనతో వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాల నుంచి వేగంగా కోలుకోవచ్చు.

 ఇది కూడా చదవండి..కిడ్నీ క్యాన్సర్ రాకుండా ఎలాంటి ముందు జాగ్రత్తలు అవసరం..?

 ఇది కూడా చదవండి..కిడ్నీ క్యాన్సర్ నివారణ సాధ్యమా..?

 ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.