Monsoon Health Alert : వర్షాకాలంలో ఈ 5 ఆహారాలకు దూరంగా ఉండకపోతే ముప్పే..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఎండాకాలం వేడి నుంచి ఉపశమనం కలిగించే వర్షాకాలం ఎన్నో వ్యాధులను కూడా మోసుకొస్తుంది. ఈ కాలంలో వాతావరణంలో తేమ పెరగడం వల్ల బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ వంటి సూక్ష్మజీవులు వేగంగా వృద్ధి చెందుతాయి. తినే ఆహారం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ వహించినా ఫుడ్ పాయిజనింగ్, కడుపులో ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాల బారిన పడే ప్రమాదం ఉంది. అందుకే వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సీజన్‌లో ఆరోగ్యంగా ఉండాలంటే ప్రధానంగా 5 రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..

 

ఇది కూడా చదవండి..కొత్తిమీర ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం..

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు పెరగడానికి ఇవే కారణం..

ఇది కూడా చదవండి..ప్రపంచంలోనే తొలిసారిగా గొర్రెలో బర్డ్ ఫ్లూ..  

ఇది కూడా చదవండి..పేస్‌మేకర్ హార్ట్ పేషెంట్లకు ఎప్పుడు అవసరం..?

 

1. ముందుగా కోసిపెట్టిన పండ్లు, సలాడ్లు.. 

బయట ఎక్కడపడితే అక్కడ అమ్మే కోసిపెట్టిన పండ్లను, సలాడ్లను ఈ కాలంలో అస్సలు తినకూడదు. ఎక్కువసేపు గాలికి వదిలేయడం వల్ల వాటిపై హానికరమైన బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. వీటిని తినడం వల్ల కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. పండ్లను ఎప్పటికప్పుడు తాజాగా ఇంటికే తెచ్చుకుని, తినే ముందే కోసుకోవడం ఉత్తమం.

2. స్ట్రీట్ ఫుడ్స్..  

వర్షాకాలంలో పానీపూరి, చాట్, భేల్ పూరి వంటి స్ట్రీట్ ఫుడ్స్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. బయట వాతావరణంలో శుభ్రత లోపించడం వల్ల, కలుషిత నీటి కారణంగా బ్యాక్టీరియా, వైరస్‌లు సులభంగా ఆహారంలోకి చేరుతాయి. కాబట్టి, రోడ్ల పక్కన దొరికే చిరుతిళ్లకు బదులుగా ఇంట్లో వండిన వేడివేడి ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి.

3. ఆకుకూరలతో జాగ్రత్త..  

సాధారణంగా ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ, వర్షాకాలంలో పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల ద్వారా ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. వర్షాలకు వీటి ఆకుల మధ్య బురద, కీటకాలు, బ్యాక్టీరియా ఎక్కువగా దాగి ఉంటాయి. ఈ కాలంలో ఆకుకూరల వాడకం తగ్గించడం మంచిది. ఒకవేళ వండుకోవాల్సి వస్తే ఉప్పు, పసుపు వేసిన వేడి నీటిలో శుభ్రంగా కడిగి వాడాలి.

4. నిల్వ ఉంచిన ఆహారం..  

వర్షాకాలంలో వండిన ఆహారం త్వరగా పాడవుతుంది. చాలామంది మిగిలిపోయిన ఆహారాన్ని ఫ్రిజ్‌లో పెట్టి మరుసటి రోజు వేడి చేసుకుని తింటుంటారు. కానీ, అందులో అప్పటికే బ్యాక్టీరియా వృద్ధి చెంది ఉండే అవకాశం ఉంది. ఇలాంటివి తినడం ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.

5. పచ్చిగా ఉండే సీ ఫుడ్..

ఈ సీజన్‌లో చేపలు, ఇతర సముద్రపు ఆహారాల ద్వారా వ్యాధులు సులభంగా సోకుతాయి. ముఖ్యంగా సగం ఉడికిన లేదా పచ్చిగా ఉన్న సీ-ఫుడ్ తినడం వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. మాంసాహారం లేదా సీ-ఫుడ్ ఏదైనా సరే బాగా ఉడికించిన తర్వాతే తీసుకోవాలి.

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిట్కాలు పాటించండి:

ఎల్లప్పుడూ వేడిగా, తాజాగా వండిన ఆహారాన్నే తీసుకోవాలి.

నీటి ద్వారానే ఎక్కువ వ్యాధులు వ్యాపిస్తాయి కాబట్టి.. నీటిని కాచి, చల్లార్చి లేదా వడబోసి తాగడం చాలా ముఖ్యం.

భోజనానికి ముందు, ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి.

మూతలు లేని, ఈగలు వాలే వస్తువులను, గాలికి తెరిచి ఉంచిన ఆహార పదార్థాలను తినకూడదు.

కూరగాయలు, పండ్లను వాడేముందు శుభ్రమైన నీటితో కనీసం రెండు మూడు సార్లు కడగాలి.

 

ఇది కూడా చదవండి..కాలేయంలోని మలినాలను శుభ్రపరచడంలో సహాయపడే విజిటబుల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..హిమోగ్లోబిన్‌ పెంచే బెస్ట్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వైద్య నిపుణులు చెప్పిన చిట్కాలు..

ఇది కూడా చదవండి..గుండె స్పందన తగ్గినప్పుడు కనిపించే లక్షణాలు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.