Potassium Deficiency : కండరాలు పదే పదే పట్టేస్తున్నాయా..? ఐతే పొటాషియం లోపం కావచ్చు..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తరచుగా కండరాలు లాగడం, నీరసం, విపరీతమైన అలసట మిమ్మల్ని వేధిస్తున్నాయా..? ఏ చిన్న పని చేసినా శరీరం సహకరించడం లేదా..? అయితే దీన్ని సాధారణ అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకండి. ఇది శరీరంలో ముఖ్యమైన ఖనిజమైన 'పొటాషియం' (Potassium) లోపానికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

శరీరంలో పొటాషియం పాత్ర..

మన శరీరం సక్రమంగా పనిచేయడానికి పొటాషియం చాలా అవసరం.

నాడుల పనితీరు..

నరాల ద్వారా మెదడుకు సంకేతాలను చేరవేయడంలో కండరాలు ముడుచుకోవడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. గుండె స్పందనలను సాధారణ స్థితిలో ఉంచడంలో, అలాగే శరీరంలో ద్రవాలు, ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడటంలో పొటాషియం ఎంతో ముఖ్యం. దీని స్థాయిలు పెరిగినా, తగ్గినా ఆరోగ్యానికి ముప్పే.

లోపాన్ని సూచించే ప్రధాన లక్షణాలు..

శరీరంలో పొటాషియం తగ్గినప్పుడు ప్రధానంగా ఈ మార్పులు కనిపిస్తాయి.

కండరాల నొప్పులు (Cramps).. కాళ్లలోని కండరాలు అకస్మాత్తుగా పట్టేయడం, మెట్లు ఎక్కుతున్నప్పుడు విపరీతమైన నొప్పి రావడం జరుగుతుంది. సాధారణ పనులు చేయడానికి కూడా మునుపటి కంటే ఎక్కువ శ్రమ పడాల్సి రావడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం పొటాషియం లోపానికి సంకేతాలు.

విపరీతమైన చెమటతో ముప్పు..

వేసవిలో ఎండలో ఎక్కువగా తిరగడం లేదా కఠినమైన వ్యాయామాలు చేసినప్పుడు శరీరం నుంచి చెమట అధికంగా బయటకు వెళ్తుంది. దీనివల్ల శరీరంలోని ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతిని పొటాషియం స్థాయిలు పడిపోతాయి. కళ్లు తిరగడం, తీవ్రమైన నీరసం వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

రోజువారీ ఆహారంలో అరటిపండ్లు లాంటివి చేర్చుకోవడం ద్వారా పొటాషియం లోపాన్ని సహజంగా అధిగమించవచ్చు. కండరాల నొప్పులు పదే పదే వస్తుంటే రక్త పరీక్ష (Blood Test) ద్వారా పొటాషియం స్థాయిలను నిర్ధారించుకోవాలి. కండరాల నొప్పులు రాగానే సొంతంగా మెడికల్ షాపుల్లో పొటాషియం సప్లిమెంట్లు కొని వాడటం ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరం. డాక్టర్ సలహా తప్పనిసరి.

ఇది కూడా చదవండి..Rainy Season : వర్షాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన కొన్ని కూరగాయలు

ఇది కూడా చదవండి...బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.