Neck Pain : మెడ తిప్పితే నొప్పా..? ఆ చిన్న పొరపాటే 'సెర్వైకల్ పెయిన్'కు కారణం కావొచ్చు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : తరచూ మెడ నొప్పితో బాధపడుతున్నారా..? కనీసం మెడను అటూ ఇటూ తిప్పడానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తోందా..? చాలామంది దీనిని అలసట లేదా పడుకునే భంగిమ సరిగా లేకపోవడం వల్ల వచ్చిన సాధారణ నొప్పిగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ, తరచూ ఈ సమస్య వస్తుంటే, లేదా ఎక్కువసేపు కూర్చున్న తర్వాత మెడ, భుజాలు పట్టేసినట్లు అనిపిస్తుంటే మాత్రం కచ్చితంగా అప్రమత్తం కావాల్సిందే. ప్రస్తుత రోజుల్లో గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్స్ వాడే యువతలో ఈ 'సెర్వైకల్ పెయిన్' (Cervical Pain) సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. మెడ చుట్టూ నొప్పి, బిగుసుకుపోవడం, భారం అనిపించడం దీని లక్షణాలు. కొందరిలో ఈ నొప్పి భుజాలు, చేతులు, తల వరకు కూడా వ్యాపిస్తుంది.

 

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..? 

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

 

నొప్పికి ప్రధాన కారణాలివే..

తప్పు భంగిమలో కూర్చోవడం: ఆఫీసుల్లో గంటల కొద్దీ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చోవడం మెడపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్క్రీన్ కిందకు ఉన్నప్పుడు మెడ వంచి పనిచేయడం వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి బిగుసుకుపోతాయి.

మానసిక ఒత్తిడి..

 కేవలం కూర్చునే భంగిమ మాత్రమే కాదు.. మానసిక ఒత్తిడి కూడా మెడ నొప్పికి దారితీస్తుంది. టెన్షన్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు తెలియకుండానే కండరాల్లో మార్పులు వచ్చి మెడ, భుజాల చుట్టూ నొప్పి అనిపిస్తుంది.

ఇతర కారణాలు..

 మొబైల్స్ వాడుతూ గంటల కొద్దీ తల దించుకుని కూర్చోవడం, ఆటలు ఆడుతున్నప్పుడు గాయపడటం, నరాలపై ఒత్తిడి పడటం వంటివి కూడా ఈ సమస్యకు కారణం కావొచ్చు.

ఇలా చెక్ పెట్టండి..!

మెడ నొప్పి బారిన పడకుండా ఉండాలంటే మన రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం చాలా అవసరం. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ ఎల్లప్పుడూ మీ కంటికి ఎదురుగా (Eye level) ఉండేలా డెస్క్, కుర్చీ ఎత్తును అడ్జస్ట్ చేసుకోవాలి. స్క్రీన్ మరీ కిందకు లేదా పైకి ఉండకూడదు.

 గంటల తరబడి కూర్చోకూడదు..

ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చోకూడదు. మధ్యమధ్యలో పనికి చిన్న బ్రేక్ తీసుకుని అటూ ఇటూ నడవాలి. మెడకు, భుజాలకు కాస్త విశ్రాంతినివ్వాలి. మెడపై ఎక్కువ ఒత్తిడి పడకుండా నెమ్మదిగా కుడి, ఎడమలకు తిప్పడం లాంటి చిన్నపాటి వ్యాయామాలు చేయాలి. రోజూ వ్యాయామం చేయడం వల్ల కండరాలు దృఢంగా ఉంటాయి. పడుకునేటప్పుడు కూడా మెడపై అదనపు భారం పడకుండా సరైన దిండును ఉపయోగించాలి. తప్పు భంగిమలో నిద్రించకూడదు.

వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి..?

మెడ నొప్పి తరచూ వస్తున్నా, రోజుల తరబడి తగ్గకుండా వేధిస్తున్నా నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా నొప్పితో పాటు చేతులు, కాళ్లలో తిమ్మిర్లు, సూదులతో గుచ్చినట్లు అనిపించడం, కండరాలు బలహీనంగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి.

ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.