Monsoon Joint Pain : వర్షాకాలంలో కీళ్ల నొప్పులు,కారణాలు, ఉపశమన మార్గాలపై ప్రత్యేక కథనం..!
సాక్షి లైఫ్ : వర్షాలు ప్రారంభం కాగానే చాలా మందిలో మోకాళ్లు, భుజాలు, వీపు, చీలమండలాల్లో నొప్పులు లేదా కీళ్లు బిగుసుకుపోవడం (Joint Stiffness) వంటి సమస్యలు మొదలవుతాయి. సాధారణంగా కీళ్లవాతం (Arthritis) ఉన్నవారికే ఈ ఇబ్బంది అనుకుంటారు కానీ, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని సాధారణ వ్యక్తులు కూడా వర్షాకాలంలో కీళ్ల నొప్పుల గురించి తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కీళ్లపై పడే ప్రభావం, దానికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?
నొప్పులు పెరగడానికి ప్రధాన కారణాలివే..!
గాలి పీడనంలో మార్పులు (Barometric Pressure)..వర్షాకాలంలో వాతావరణంలో గాలి పీడనం తగ్గుతుంది. దీనివల్ల శరీరంలోని కీళ్ల చుట్టూ ఉండే కణజాలాలు (Tissues) కొద్దిగా విస్తరించి, కీళ్లపై అదనపు ఒత్తిడి పడుతుంది. ఫలితంగా నొప్పి, బిగుతు పెరుగుతాయి.పెరిగిన తేమ (Humidity)..గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల కండరాలు, కీళ్ల పనితీరుపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఉదయం పూట పడకపై నుంచి లేచే సమయంలో అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది.
కండరాల బిగుతు..చల్లని, తేమతో కూడిన వాతావరణం కారణంగా రక్త ప్రసరణ వేగం తగ్గి, కండరాలు సులభంగా బిగుసుకుపోతాయి. ఇది కీళ్ల నొప్పులను మరింత తీవ్రం చేస్తుంది.తగ్గిన శారీరక శ్రమ.. వర్షాల వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం, వాకింగ్ లేదా వ్యాయామాలు తగ్గించడం వల్ల కీళ్లు కదలికలు లేక మొద్దుబారుతాయి. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా నొప్పులు ఎక్కువవుతాయి. పాత గాయాలు తిరగబెట్టడం.. గతంలో మోకాళ్లకు లేదా ఇతర కీళ్లకు తగిలిన గాయాలు వాతావరణ మార్పులకు తీవ్ర సున్నితంగా మారుతాయి. చలి తీవ్రత పెరిగినప్పుడు అక్కడ మళ్లీ నొప్పి వచ్చే అవకాశం ఉంది.
ఉపశమనం కోసం సులభమైన మార్గాలు..
తేలికపాటి వ్యాయామాలు..వర్షం వల్ల బయటకు వెళ్లలేకపోయినా, ఇంట్లోనే యోగా, తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల కీళ్ల సరళత (Flexibility) పెరుగుతుంది. శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం..చల్లటి గాలి తగలకుండా చూసుకోవాలి. నొప్పులు ఉన్న చోట హాట్ వాటర్ బ్యాగ్‌తో వెచ్చని కాపడం (Warm Compress) పెట్టుకుంటే రక్త ప్రసరణ మెరుగై నొప్పి తగ్గుతుంది. సరైన భంగిమ..ఎక్కువ సేపు ఒకే చోట, ఒకే భంగిమలో కూర్చోకూడదు. మధ్యమధ్యలో కాసేపు అటు ఇటు నడవాలి. బరువు పెరగకుండా నియంత్రణలో ఉంచుకోవడం మోకాళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. పౌష్టికాహారం..ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, విటమిన్-డి, ప్రొటీన్లు అధికంగా ఉండే సమతుల్య ఆహారాన్ని డైట్లో చేర్చుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.
వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?
కీళ్ల నొప్పులు సాధారణమైనవే అయినా.. కొన్ని రోజులుగా నొప్పి తగ్గకుండా నిరంతరాయంగా వేధిస్తున్నా, కీళ్ల భాగంలో వాపు లేదా ఎరుపుదనం కనిపించినా, తాకినప్పుడు వేడిగా అనిపించినా తక్షణమే ఆర్థోపెడిస్ట్ ను సంప్రదించాలి. నొప్పితో పాటు జ్వరం రావడం, రోజువారీ పనులు చేసుకోలేనంతగా ఇబ్బంది పెట్టడం వంటి లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సకాలంలో వైద్య సలహా పొందడం వల్ల భవిష్యత్తులో వచ్చే తీవ్రమైన ఎముకల సమస్యలను నివారించవచ్చు.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
