ఏ సమయంలో స్నానం చేయడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి..?
సాక్షి లైఫ్ : స్నానం చేయడం వల్ల ఫ్రెష్ గా ఉండడమేకాకుండా, అది మన మనస్సును కూడా ఉత్సాహంగా ఉంచుతుందని మనం వింటున్నాము. కానీ ఉదయం స్నానం చేయడం మంచిదా..? లేదా రాత్రి స్నానం చేయడం మంచిదా..? అనేది మీరు కోరుకునే దానిపై ఆధారపడి ఉంటుంది. ఉదయం స్నానం చేయడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది, రాత్రి వేడి నీటితో స్నానం చేయడం వల్ల మంచి నిద్ర పడుతుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..మంచి కొలెస్ట్రాల్ ను పెంచే దానిమ్మ..
స్నానం చేయడం ద్వారా, మన శరీరం మొత్తం ఉన్న మురికి శుభ్రమవుతుంది. బాక్టీరియా కూడా వెళ్ళిపోతుంది. స్నానం చేయడం వల్ల అలసట తొలగిపోవడమే కాకుండా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
అయితే, నేటి కాలంలో, స్నానం చేయడానికి నిర్దిష్ట సమయం ఉండడం లేదు. ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాన్ని బట్టి స్నానం చేస్తున్నారు. ఎప్పుడైనా, ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం స్నానం చేస్తున్నారు. కానీ ఉదయం లేదా రాత్రి స్నానం చేయడం మంచిదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీరు ఫ్రెష్ గా ఉండాలనుకుంటున్నారా..? లేదా మంచి నిద్ర పొందాలను కుంటున్నారా..? లేదా మీరు సృజనాత్మకంగా ఏదైనా చేయాలను కుంటున్నారా? అందుకోసం ఎప్పుడు స్నానం చేయాలి..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఉదయం స్నానం చురుకుగా ఉండటానికి ఉత్తమ మార్గం..
ఉదయం స్నానం చేయడం వల్ల మన శరీరం చురుకుగా ఉంటుంది. గతంలో సూర్యుడు ఉదయించగానే నిద్రలేచి స్నానం చేసేవాళ్ళు. తద్వారా శరీరం ఉత్తేజంగా ఉండేది. అదే అలవాటు ఇప్పటికీ కొనసాగుతుంది. ఉదయం చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల మన శరీరం వేడిని నిర్వహించ డానికి సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఇది మన శరీరాన్ని తాజాగా ఉంచుతుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
