అపోహలు-వాస్తవాలు : బొల్లి వ్యాధి తాకడం ద్వారా వ్యాపిస్తుందా..? 

షేర్ చేయండి:
అపోహలు-వాస్తవాలు : బొల్లి వ్యాధి తాకడం ద్వారా వ్యాపిస్తుందా..? 

సాక్షి లైఫ్: బొల్లి అనేది చర్మ సంబంధిత వ్యాధి. దీనిని తెల్ల మచ్చలు అని కూడా అంటారు. ఇందులో చర్మంపై తెల్లటి దద్దుర్లు ఏర్పడతాయి. ఇది స్వయం ప్రతిరక్షక వ్యాధి. ఇది ఏ వయస్సులోనైనా సంభవించ వచ్చు. ఈ వ్యాధికి సంబంధించి ప్రజలలో అనేక అపోహలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

వైట్ లెప్రసీ.. 


 బొల్లిని 'వైట్ లెప్రసీ' లేదా వైట్ స్పాట్స్ అని కూడా అంటారు. ఇది శరీరంలో దురదతో మొదలై క్రమంగా శరీరంలోని వివిధ భాగాలపై చిన్న లేదా పెద్ద తెల్లటి దద్దుర్లు ఏర్పడతాయి. నొప్పి లేదా మరే ఇతర సమస్య లేనప్పటికీ అందవిహీనంగా కనిపిస్తారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రజలలో అనేక అపోహలు ఉన్నాయి. ప్రపంచ బొల్లి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 25న జరుపుకుంటారు. ఈ రోజును జరుపుకోవడంలో ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే..? ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, దానికి సంబంధించిన అపోహలను తొలగించడం. అలాంటి కొన్ని అపోహల గురించి తెలుసుకుందాం.

అపోహ:  బొల్లి అంటు వ్యాధా..? తాకడం ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుందా..? 

 నిజం : బొల్లి అంటు వ్యాధి కాదు. అంటే వ్యక్తిగత వస్తువులను తాకడం, కలిసి భోజనం చేసినా లేదా, లాలాజలం ద్వారా గానీ ఇది అస్సలు వ్యాపించదు.

అపోహ: చేపలు తిన్న తర్వాత పాలు తాగడం వల్ల బొల్లి వ్యాధి వస్తుందా..?  

నిజం :  బొల్లికి సంబంధించిన ఈ దురభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఇది నిజం కాదు. ఐనప్పటికీ కొందరు ఇప్పటికీ నమ్ముతారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ డిసీజ్.  

అపోహ: బొల్లి చికిత్స సాధ్యం కాదు..? 

నిజం- ఇది నిజం కాదు. చాలా సందర్భాలలో, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ఈ సమస్యను పూర్తిగా నయం చేయవచ్చు. బొల్లి చికిత్సకు మందులు, వివివిధ వైద్య విధానాలు ఉన్నాయి. కాకపోతే చికిత్స ఎక్కువకాలం పాటు తీసుకోవాల్సి ఉంటుంది.


అపోహ:  పుల్లటి పదార్థాలు తినడం వల్ల బొల్లి సమస్య పెరుగుతుందా..? 

నిజం:  ఈ సమస్య పెరగడానికి ఆహారంతో ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ప్రత్యేకమైన ఆహారపదార్థం తినడం వల్ల అది పెరగదు.

అపోహ: బొల్లి వ్యాధి మానసికంగా, శారీరకంగా బలహీనపరుస్తుంది.

నిజం:  ఈ విషయంలో నిజం లేదు. బొల్లి సమస్య చర్మానికి సంబంధించినది. ఇది శరీరంలోని ఏ ఇతర భాగాలపై ప్రభావం చూపదు.

ఇది కూడా చదవండి..  ఇన్‌స్టంట్ నూడుల్స్ సైడ్ ఎఫెక్ట్స్.. 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

ఇది కూడా చదవండి..  మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.