సి విటమిన్ సహజంగా పొందవచ్చు ఇలా..
సాక్షి లైఫ్ : సహజంగా విటమిన్ సి పొందడానికి అనేక సులభమైన మార్గాలు ఉన్నాయి. మన శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ సి ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, గాయాలను త్వరగా మానేలా చేయడానికి సహాయపడుతుంది. విటమిన్ సి లోపం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఈ విటమిన్‌ను టాబ్లెట్ల రూపంలో కాకుండా, ప్రకృతిసిద్ధంగా, సులభంగా లభించే ఆహార పదార్థాల ద్వారా పొందవచ్చు. పండ్లు, కూరగాయలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
విటమిన్ "సి" ఫుడ్..
వాతావరణంలో మార్పులు ప్రారంభమైన వెంటనే శరీర రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఈ సీజన్‌లో త్వరగా ఇన్‌ఫెక్షన్‌కు గురికావడం వల్ల త్వరగా అనారోగ్యానికి గురవుతారు.
ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా ఉండాలంటే, అతని రోగనిరోధక శక్తి సరిపడా ఉండాలి. అటువంటి పరిస్థితిలో, మీరు ఆరోగ్యంగా ఉండటానికి మీ రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవాలనుకుంటే, వెంటనే మీ ఆహారంలో విటమిన్ "సి" అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి.
నారింజ..
ఆరెంజ్ విటమిన్ "సి" ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. ఈ పండు ప్రత్యేకత ఏమిటంటే..? ఇది చలి కాలంలో సులభంగా దొరుకుతుంది. వింటర్ సీజన్‌లో ఆరెంజ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
బొప్పాయి..
బొప్పాయి 200 శాతం కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉండే పండు. విటమిన్ సి కాకుండా, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా బొప్పాయిలో ఉన్నాయి. బొప్పాయి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పని చేయడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
జామ..
శీతాకాలంలో దొరికే తీపి- పుల్లని రుచికరమైన పండు జామ, మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండుప్రయోజనాలను పొందడానికి మీరు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. పింక్ జామపండ్లలో విటమిన్ "ఎ" ,"సి", అలాగే ఒమేగా 3, ఒమేగా 6 పాలీఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు , ఫైబర్ అధికంగా ఉంటాయి.
బ్రకోలీ..
బ్రకోలీలో విటమిన్ "సి", విటమిన్ "కె", విటమిన్ "ఎ" ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో, మీరు సూప్, కూరగాయలు లేదా సలాడ్ రూపంలో మీ ఆహారంలో బ్రకోలీని చేర్చుకోవచ్చు. దీని రోజువారీ వినియోగం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అరకప్పు ఉడికించిన బ్రకోలీ రోజువారీ విటమిన్ "సి"లో 57 శాతం అందించగలదు.
క్యాప్సికమ్..
క్యాప్సికమ్ ను రెడ్ బెల్ పెప్పర్ అని కూడా అంటారు. క్యాప్సికమ్ విటమిన్ 'సి"తో పాటు విటమిన్ "ఏ " ఫైబర్ మంచి మూలంగా కూడా పరిగణిస్తారు. ఒక మీడియం సైజ్ రెడ్ బెల్ పెప్పర్ తినడం వల్ల రోజువారీగా అవసరమైన 169 శాతం విటమిన్ అందుతుంది.
ఇది కూడా చదవండి.. పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
