Vitamin C : సహజసిద్ధంగా 'విటమిన్‌ సి'.. మందులకంటే ముందు ఈ ఆహారాలు చాలా బెటర్..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మన శరీరానికి అత్యంత అవసరమైన కీలక పోషకాల్లో 'విటమిన్ సి' (Vitamin C) ముందు వరుసలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని ( immunity) పెంచడమే కాకుండా.. చర్మం, ఎముకలు, రక్తనాళాల ఆరోగ్యానికి, గాయాలు త్వరగా మానడానికి ఎంతో అవసరం. చాలామంది విటమిన్ సి లోపాన్ని భర్తీ చేసుకునేందుకు వెంటనే సప్లిమెంట్ల (supplements) వైపు మొగ్గుచూపుతారు. కానీ, లోపం తీవ్రంగా లేనప్పుడు కేవలం మనం తీసుకునే రోజువారీ ఆహారం ద్వారానే ఈ విటమిన్‌ను సమృద్ధిగా పొందవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. మరి విటమిన్ సి పుష్కలంగా లభించే ఆ సహజసిద్ధమైన ఆహారాలు ఏమిటో చూద్దామా..!

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

 

విటమిన్ సి గనులు.. ఈ పండ్లు, కూరగాయలు..!

1. ఉసిరి (Amla)..

విటమిన్ సి కి కేరాఫ్ అడ్రస్ ఉసిరి. ఇది సహజసిద్ధమైన బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరగడమే కాకుండా, చర్మం నిగనిగలాడుతుంది. జీర్ణవ్యవస్థ కూడా చురుగ్గా పనిచేస్తుంది. ఉసిరికాయను పచ్చిగా కానీ, జ్యూస్, మురబ్బా లేదా పొడి రూపంలో కానీ తీసుకోవచ్చు.

2. జామ (Guava)..

నారింజ పండు కంటే జామకాయలోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుందన్న విషయం చాలామందికి తెలియదు. దీనిలో పీచుపదార్థం (fiber) కూడా మెండుగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది, రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

3. నారింజ (Orange)..

విటమిన్ సి అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చే పండు నారింజ. దీన్ని తరచుగా తినడం లేదా రసం తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది. చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.

4. నిమ్మ (Lemon)..

మన వంటగదిలో ఎప్పుడూ ఉండే నిమ్మకాయ.. విటమిన్ సి కి మంచి మూలం. ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగడం లేదా సలాడ్ల మీద పిండుకుని తినడం చాలా మంచిది.

5. కివి (Kiwi)..

కివి పండ్లలో విటమిన్ సి తో పాటు విటమిన్ ఇ, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.

6. క్యాప్సికమ్ (Capsicum)..

కూరగాయల విషయానికి వస్తే ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో దొరికే క్యాప్సికమ్‌లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. వీటిని సలాడ్లు, కూరలు, శాండ్‌విచ్‌లలో విరివిగా వాడుకోవచ్చు.

7. స్ట్రాబెర్రీ (Strawberry)..

చూడటానికి ఆకర్షణీయంగా ఉండే స్ట్రాబెర్రీలలో విటమిన్ సితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యంతో పాటు గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

8. బొప్పాయి (Papaya)..

బొప్పాయి పండులో విటమిన్ సి, విటమిన్ ఏ, జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు ఉంటాయి. ఇది కడుపు ఆరోగ్యానికి, ఇమ్యూనిటీకి డబుల్ బూస్టర్‌లా పనిచేస్తుంది.

మీలో విటమిన్ సి లోపించిందని తెలిపే సంకేతాలివే..

తరచుగా జలుబు, దగ్గు బారిన పడటం.

సరైన నిద్ర ఉన్నప్పటికీ ఎప్పుడూ నీరసంగా, అలసటగా అనిపించడం.

పళ్లు తోముకునేటప్పుడు చిగుళ్ల నుంచి రక్తం కారడం.

చిన్నచిన్న గాయాలైనా త్వరగా మానకపోవడం.

చర్మం బాగా పొడిబారిపోయి, కళావిహీనంగా మారడం.

జుట్టు రాలడం, కుదుళ్లు బలహీనపడటం.

తరచుగా ఏవో ఒక ఇన్ఫెక్షన్లు రావడం ,

రోగనిరోధక శక్తి తగ్గడం.

 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.