సాక్షి లైఫ్ : అన్నం ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారని, అలాగే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిపోతాయని చాలామంది అనుకుంటారు. అందుకే రైస్‌ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తారు కూడా. కొందరు రాత్రి సమయంలో చపాతీలు, పుల్కాలు, సూప్‌లతో సరిపెట్టేస్తారు.
అన్నం తింటే..?
అన్నం తినడం వల్ల చక్కర స్థాయిలు పెరగవా..? అంటే..? అదేం లేదంటున్నారు న్యూటిషియన్లు. దీనిపై అధ్యయనం చేసిన యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూటిషియన్లు కూడా రైస్‌ను హాయిగా తినొచ్చని చెబుతున్నారు. అదంతా కేవలం అపోహే అని వెల్లడిస్తున్నారు.
ఆ రైస్‌కి తాము చెప్పిన వాటిని జోడించి తింటే ఆ భయాలు కూడా ఉండవని నొక్కి చెబుతున్నారు. ఐతే మధుమేహం వ్యాధి గ్రస్తులు కూడా రైస్ రెండుపూటలా తినొచ్చా..?
రైస్‌లో అత్యంత సాధారణ కార్బోహైడ్రేట్ ఉంటుందని అంటున్నారు ప్రముఖ న్యూటిషియన్ పూర్ణిమ. ఆహారంలో రైస్ ఎక్కువుగా తీసుకుంటే బరువు పెరుగుతామన్న భయంతో కొద్దికొద్దిగానే తింటూ బాధ పడుతుంటారు. కానీ అది నిజం కాదని న్యూటిషియన్లు చెబుతున్నారు.
ఇది బరువు తగ్గడంలోనూ, చక్కెర స్థాయిలను నిర్వహించడంలోనూ సమర్థవంతంగా పనిచేస్తుందంటూ షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. ఈ మేరకు యూరోపియన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ అధ్యయనంలో కనుగొన్న ఆసక్తికర విషయాలు ఏంటంటే..?
గ్లూకోజ్ స్థాయిలు..
తెల్లటి అన్నంలో వంద శాతం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. అదే రైస్‌కి వెనిగర్ కలిపి వండుకుంటే గ్లూకోజ్ స్థాయిలు పెరుతాయన్న భయమే ఉండదు. బియ్యానికి వెనిగర్‌ని జోడించడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా తగ్గిపోతుంది.
అలాగే రైస్‌కి పాలు చేర్చడం వల్ల మంచి ప్రోటీన్ లభిస్తుంది. ఆటోమెటిక్‌గా గ్లైసెమిడ్ ఇండెక్స్ తగ్గుతుందని సోయాబీన్ లేదా సోయాబీన్ ఉత్పత్తులతో కూడిన బియ్యంలో కూడా గ్లైసెమిక సూచిక తక్కువగా ఉంటుంది.
ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. నిమ్మరసాన్ని జోడించడం వల్ల కూడా గ్లైసెమిక్ ఇండెక్స్ ప్రభావం గణనీయంగా 40 శాతం తగ్గుతుందని అధ్యయనంలో తేలింది.
బరువు కూడా..
నిమ్మరసంతో అన్నం తినడం వల్ల ఎక్కువుగా తిన్న అనుభూతి కలుగుతుంది. అందువల్ల తెలియకుండానే ఈజీగా బరువు కూడా తగ్గుతారు. పులియబెట్టిన పదార్థాలను రైస్‌కి జోడించడం వల్ల కూడా గ్లూకోజ్ స్థాయిలు తక్కువుగానే ఉంటాయి. ఉదాహరణకు కొబుచా, సౌర్‌క్రాట్, కిమ్చి, మిసో, పెరుగు తదితరాలు ప్రేగులకు మంచిది.
ఎసిటిక్ యాసిడ్‌తో కలిగిన పదార్థాలు లేదా వెనిగర్ ఆధారిత పదార్థాలు, పచ్చళ్లు, సాస్‌లు, ఆవాలు, సలాడ్‌లు తదితరాలు అన్నానికి జోడించి తీసుకుంటే మంచిది.
చక్కెర స్థాయిలు..
ఇది కుదరనట్లయితే రైస్‌లో ఏదో రకంగా నిమ్మరసం జోడించి తీసుకోవడం మంచి ఆప్షన్‌ని అని న్యూట్రిషియన్ పూర్ణిమ చెబతున్నారు. ఇలా తీసుకుంటుంటే బరువు తగ్గడమే గాక రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను నియంత్రించవచ్చని అంటున్నారు న్యూట్రిషియన్స్ వెల్లడిస్తున్నారు.
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com