Manganese : మాంగనీస్‌తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
సాక్షి లైఫ్ : మన శరీరానికి అవసరమైన సూక్ష్మ పోషకాలలో (Micronutrients) మాంగనీస్ ఒకటి. ఈ ఖనిజం తక్కువ మొత్తంలో అవసరమైనప్పటికీ, ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి. ఎముకల నిర్మాణం నుంచి మెదడు పనితీరు వరకు, శక్తి ఉత్పత్తి నుంచి యాంటీఆక్సిడెంట్ రక్షణ వరకు మాంగనీస్ కీలక పాత్ర పోషిస్తుంది.
పంచదార, తేనె, మాంక్ ఫ్రూట్ లలో.. ఆరోగ్యకరమైన స్వీటెనర్ ఏది..?
New study : బోన్ స్ట్రెంత్ విషయంలో గట్ హెల్త్ పాత్ర కీలకం..
ఏట్రియల్ కార్డియోమయోపతి లక్షణాలు ఎలా ఉంటాయి..?
మాంగనీస్ లోపిస్తే ఎముకల బలహీనత, జీవక్రియ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. మాంగనీస్ శరీరంలో అనేక ముఖ్యమైన ఎంజైమ్‌ల పనితీరుకు తోడ్పడుతుంది. ముఖ్యంగా...ఎముకల దృఢత్వం విషయంలో మాంగనీస్ ఎముకల అభివృద్ధికి, వాటి నిర్మాణానికి కీలకమైన కొల్లాజెన్ బంధన కణజాలం (Connective Tissue) ఉత్పత్తిలో సహాయపడుతుంది. ఇది ఎముకల బలం, సాంద్రతను కాపాడుతుంది.
ఇది 'మాంగనీస్ సూపర్ ఆక్సైడ్ డిస్‌ముటేస్ (MnSOD)' అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్‌ను సక్రియం చేస్తుంది. ఇది కణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించి, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొలెస్ట్రాల్‌ను ప్రాసెస్ చేయడంలో మాంగనీస్ పాలు పంచుకుంటుంది. దీనివల్ల జీవక్రియ (Metabolism) రేటు మెరుగుపడుతుంది. ఇది గ్లూకోజ్ జీవక్రియలో పాల్గొని, ఇన్సులిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.మెదడు ఆరోగ్యం: మాంగనీస్ మెదడు పనితీరుకు, నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి అవసరం. ఇది అభిజ్ఞా పనితీరు (Cognitive Function) మానసిక స్థితి (Mood) మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
