న్యూ స్టడీ : లంగ్ క్యాన్సర్ ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తోంది..?
సాక్షి లైఫ్: క్యాన్సర్ అనేది ఒక ప్రాణాంతక వ్యాధి. ఊపిరితిత్తుల క్యాన్సర్ రకాలలో ఇది కూడా ఒకటి. ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ధూమపానం చేసేవారిలో మాత్రమే ఉంటుందని భావిస్తారు. కానీ లాన్సెట్ చేసిన కొత్త అధ్యయనం అనేక ఆసక్తికర విషయాలను గురించి వెల్లడించింది. ధూమపానం చేయని వారిలో కూడా లంగ్ క్యాన్సర్ వేగంగా పెరుగుతోందని తాజా అధ్యయనంలో తేలింది.
ఇది కూడా చదవండి..ఎక్స్-రే రేడియేషన్ వల్ల కలిగే నష్టాన్ని శరీరం ఎలా సరిచేస్తుంది..?
ఇది కూడా చదవండి..మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు వేసుకుంటున్నారా..?
ఇది కూడా చదవండి..సహజంగా హార్మోన్లను సమతుల్యం చేయడానికి ఎనిమిది సులభమైన మార్గాలు..
ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదం..
ధూమపానం చేసేవారికే కాదు, చేయని వ్యక్తులకు కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. దీనిపై లాన్సెట్ తాజాగా అధ్యయనం చేసింది. నేడు ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలకు ప్రధాన కారణాలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. ఇది సాధారణంగా ధూమపానం చేసేవారిలోనే ఎక్కువగా వచ్చే వ్యాధిగా పరిగణిస్తారు. అయితే ఇటీవల 'లాన్సెట్' అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురించిన ఒక కొత్త అధ్యయనం లాన్సెట్ స్టడీ 2025 నివేదికలో లంగ్ క్యాన్సర్ పొగతాగనివారిలో సైతం వస్తుందని తెలిపింది.
ఈ అధ్యయనం ప్రకారం, ఊపిరితిత్తుల క్యాన్సర్ కేవలం ధూమపానం చేసేవారికి మాత్రమే పరిమితం కాదు, ఇది ఎప్పుడూ ధూమపానం చేయని వారిని కూడా ప్రభావితం చేస్తోందని వెల్లడించింది. ఈ అధ్యయనం ఊపిరితిత్తుల క్యాన్సర్ గురించి మన అవగాహనను పూర్తిగా మార్చబోతోంది. లంగ్ క్యాన్సర్ నివారణ, చికిత్స పద్ధతులలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ఈ ఐదింటిని ఎక్కువగా ఉడికిస్తే .. క్యాన్సర్.. !
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
