సాక్షి లైఫ్ : కొన్ని ఆహారాలు ఎక్కువగా ఉడికించినట్లయితే క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే హానికరమైన రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. సరైన ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి అలవాట్లు లేకపోవడం కారణంగా కూడా చాలా మంది ఈ మహమ్మారి బారీన పడుతున్నారు. క్యాన్సర్ ప్రమాద కారకాల గురించి అవగాహన లేకపోవడంతో ప్రపంచదేశాల్లో సైతం క్యాన్సర్ కేసులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ఎక్కువగా ఉడికించకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి.. అవేంటంటే..?
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
కొన్ని ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2025: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న జరుపుకుంటారు. ఈ దినోత్సవం క్యాన్సర్ గురించి అవగాహన పెంచడానికి, నివారణ చర్యలను ప్రోత్సహించడానికి , వ్యాధితో పోరాడటానికి చేసే ప్రయత్నాలను జనాలకు చేరే అవకాశాన్ని అందిస్తుంది.
క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను బలిగొంటున్న వ్యాధి. ఈ మహమ్మారి రావడానికి జన్యు, పర్యావరణ జీవనశైలి అంశాలు కారణాలే. అంతేకాదు దీనికి ప్రధాన కారణాలలో మన ఆహారం కూడా ఒకటి. అలాంటి ఆహారంలో ఐదురకాల ఆహారాలను ఎక్కువగా ఉడికించకూడదు. వీటిని ఎక్కువగా ఉడికించడం వల్ల క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది. వీటిని అర్థం చేసుకుని సరిగ్గా వండటం ద్వారా, ఈ ప్రాణాంతక వ్యాధి ప్రమాదాన్ని మనం కొంతమేర తగ్గించుకోవచ్చు.
బంగాళాదుంపలు, ఇతర పిండి పదార్ధాలు..
బంగాళాదుంపలు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇతర పిండి పదార్ధాలను అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉడికించడం లేదా వేయించడం వలన అక్రిలామైడ్ అనే హానికరమైన రసాయనం ఏర్పడుతుంది. ఈ రసాయనం క్యాన్సర్‌కు కారణం కావచ్చు. 120 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద పిండి పదార్ధాలను వండినప్పుడు ఈ రసాయనం ఉత్పత్తి అవుతుంది. అందువల్ల, బంగాళాదుంపలు లేదా ఇతర పిండి పదార్ధాలను లేత బంగారు రంగు వచ్చేవరకు మాత్రమే ఉడికించి, అవి మరీ గోధుమ రంగులోకి లేదా నల్లగా మారకుండా చూసుకోవడం చాలామంచిది.
మాంసం, చేపలు..
అధిక ఉష్ణోగ్రతల వద్ద మాంసం, చేపలను వండటం లేదా గ్రిల్ చేయడం వల్ల హెటెరోసైక్లిక్ అమైన్స్ (హెచ్ సి ఏలు) పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ (పి ఏహెచ్ లు) అనే హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఈ రసాయనాలు డీఎన్ ఏ ను దెబ్బతీసి క్యాన్సర్‌కు కారణమవుతాయి. తక్కువ వేడి మీద మాంసాన్ని ఉడికించడం, ఎక్కువగా కాల్చకుండా ఉండటం వల్ల ఈ ప్రమాదాన్ని తగ్గించవచ్చు. మాంసాన్ని మ్యారినేట్ చేయడం వల్ల ఈ రసాయనాలు ఏర్పడటం కూడా తగ్గుతుంది.
నూనెలు, కొవ్వులు..
నూనెను మళ్లీ వేడి చేయడం లేదా స్మోకింగ్ పాయింట్‌కు వేడి చేయడం వల్ల అక్రోలిన్,ఇతర హానికరమైన ఎంజైమ్‌లు శరీరంలోకి ప్రవేశించి ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. తద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, ఒకసారి ఉపయోగించిన తర్వాత నూనెను తిరిగి ఉపయోగించవద్దు. దానిని ఎక్కువగా వేడి చేయకుండా ఉండడం ఉత్తమం. అలాగే, ఆలివ్ నూనె లేదా కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలను ఉపయోగించడం మంచిది.
బ్రెడ్ ,బేకరీ ఉత్పత్తులు..
బ్రెడ్, టోస్ట్ , ఇతర బేకరీ ఉత్పత్తులను ఎక్కువగా ఉడికించడం లేదా కాల్చడం వల్ల కూడా అక్రిలామైడ్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా, టోస్ట్‌ను చాలా గోధుమ రంగులో లేదా ముదురు రంగువచ్చేవరకు వేయించవద్దు. లేత బంగారు గోధుమ రంగు వచ్చేవరకు దీన్ని టోస్ట్ చేయడం సురక్షితం. దీనితో పాటు, బేకరీ ఉత్పత్తులలో ఉండే చక్కెరను అధికంగా వేడి చేయడం వల్ల హానికరమైన ఎంజైమ్‌లు కూడా ఉత్పత్తి అవుతాయి.
చక్కెర ,చక్కెర ఆహారాలు..
అధిక ఉష్ణోగ్రతల వద్ద చక్కెరను వేడి చేయడం వలన అడ్వాన్స్‌డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ (AGEs) ఉత్పత్తి అవుతాయి. ఈ ఎంజైమ్‌లు శరీరంలో మంట, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతాయి. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అందువల్ల, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను ఎక్కువగా ఉడికించడం లేదా కాల్చడం మానుకోవాలి. స్వీట్లు , డెజర్ట్‌లను తక్కువ మంట మీద ఉడికించడంతోపాటు అవి ఎక్కువగా గోధుమ రంగులోకి మారకుండా నిరోధించడం ముఖ్యమని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com