OCD బాధితులకు సరికొత్త వైద్యం.. మెదడుకు విద్యుత్ ప్రేరణతో చికిత్స..!
సాక్షి లైఫ్ : OCD అనేది ఒక దీర్ఘకాలిక మానసిక సమస్య. ఇందులో రోగులకు అవాంఛిత ఆలోచనలు రావడం, ఒకే పనిని పదేపదే చేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మందులు, థెరపీలు అందరిపై పూర్తిస్థాయిలో ప్రభావం చూపడం లేదు. ఈ నేపథ్యంలో, మొహమ్మద్ అలీ సలేహినెజాద్ , బృందం నిర్వహించిన 16 క్లినికల్ ట్రయల్స్ విశ్లేషణలో 'tES' పద్ధతి ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తేలింది.
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
పరిశోధనలో తేలిన కీలక విషయాలు..
tES పద్ధతి ద్వారా OCD తీవ్రత గణనీయంగా తగ్గినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ముఖ్యంగా రోజుకు రెండుసార్లు ఈ స్టిమ్యులేషన్ ఇవ్వడం వల్ల మెరుగైన ఫలితాలు వచ్చాయి. మెదడులోని మెడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్, ఆర్బిటోఫ్రంటల్ కార్టెక్స్ వంటి భాగాలను లక్ష్యంగా చేసుకుని ఈ విద్యుత్ ప్రేరణ ఇవ్వడం వల్ల ఆలోచనా విధానంలో మార్పులు వస్తున్నట్లు గమనించారు.
సురక్షితమైన పద్ధతి..
ఇది శస్త్రచికిత్స అవసరం లేని (Non-invasive), సురక్షితమైన పద్ధతి కావడం విశేషం. మెదడులోని నిర్దిష్ట సర్క్యూట్లను ప్రేరేపించడం ద్వారా OCDని నియంత్రించవచ్చని ఈ అధ్యయనం నిరూపించింది. అయితే, ఈ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు, భవిష్యత్తులో మరిన్ని లోతైన పరిశోధనలు అవసరమని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. త్వరలోనే ఇది అందుబాటులోకి వస్తే, మందులతో నయం కాని క్లిష్టమైన OCD కేసులకు ఇది ఒక వరంగా మారనుంది. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. మీకు ఇలాంటి సమస్యలు ఉంటే నిపుణులైన సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం శ్రేయస్కరం.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
