Oral Cancer : ఓరల్ క్యాన్సర్ కు కారణాలు ఏమిటి..? 

షేర్ చేయండి:
Oral Cancer : ఓరల్ క్యాన్సర్ కు కారణాలు ఏమిటి..? 

సాక్షి లైఫ్ : భారతదేశంలో పురుషులలో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్. ఇలాంటి తల, మెడ క్యాన్సర్లకు పొగాకు వాడకం ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు. తల, మెడ క్యాన్సర్‌లో చెవి, ముక్కు, నోరు, పెదవులు, నాలుక, గొంతు, చెంప, లాలాజల గ్రంథులు వంటి అవయవాలను క్యాన్సర్‌ ప్రభావితం చేస్తుంది.

ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?  

ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

అలవాటులో భాగంగా ఉదయం భోజనం చేసే ముందు పళ్లు తోముకున్నట్లే, ఆరోగ్యంగా ఉండేందుకు రాత్రి భోజనం చేసిన తర్వాత పళ్లు తోముకోవాలి. రాత్రిపూట ఆహారం, పొగాకు, తమలపాకులను నోటిలో వేసుకుని నిద్రపోవడం వల్ల నోటి క్యాన్సర్‌ వచ్చే ముప్పు ఎక్కువని అధ్యయనాలు చెబుతున్నాయి. 


ఇలాంటి వాటిని ప్రాణాంతకమైన క్యాన్సర్లుగా భావిస్తారు. పొగాకు వాడకాన్ని నివారించడంతో పాటు, నోటి పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. భోజనం చేసిన తర్వాత నోటిని శుభ్రంగా కడుక్కోవడం వల్ల ఇలాంటి క్యాన్సర్ల బారిన పడకుండా చూసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి..అల్జీమర్స్ కు చికిత్స ఏమిటి..?

ఇది కూడా చదవండి.. జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..  చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.