ప్రాణాలపై పంజా విసురుతున్న పామాయిల్..  

సాక్షి లైఫ్ : యువతలోనూ గుండెపోటు కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ఆహారపు అలవాట్లపై వైద్య నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం నిత్యం ఇష్టంగా తినే జంక్ ఫుడ్‌లో విరివిగా వాడుతున్న పామాయిల్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం, సిగరెట్ల కంటే కూడా పామాయిల్తో తయారైన ఆహార పదార్థాలు ఎక్కువ హాని కలిగిస్తాయని వారు స్పష్టం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పైనాపిల్ జ్యూస్.. 

ఇది కూడా చదవండి..ఆటిజంకు జీర్ణ వ్యవస్థకు, మెదడుకు సంబంధం : న్యూ స్టడీ

ఇది కూడా చదవండి.. లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..? 

ప్రపంచంలోనే అత్యధికంగా పామాయిల్ దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో మనది మొదటి స్థానం. పరిశోధకుల ప్రకారం, పామాయిల్ ఇంతగా ప్రాచుర్యం పొందడానికి వెనుక ఒక పెద్ద మాఫియా పనిచేస్తోంది. ప్రస్తుతం అన్ని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలోనూ పామాయిల్నే వినియోగిస్తున్నారు. 

ఇతర నూనెల కంటే తక్కువ ధర, ఎక్కువ ఉత్పత్తి ఉండటంతో వ్యాపారులు దీనికే ప్రాధాన్యత ఇస్తున్నారు. పెద్ద కంపెనీలు సైతం బిస్కెట్లు, కుకీలు, చాక్లెట్ల తయారీలో పామాయిల్ను విరివిగా వాడుతున్నాయి. ఒక ప్రముఖ చిప్స్ కంపెనీ తమ ఉత్పత్తుల్లో 100 శాతం పామాయిల్నే ఉపయోగిస్తుండటం గమనార్హం. 

అయితే, ఇదే కంపెనీ విదేశాల్లో పామాయిల్ జోలికి వెళ్లకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పామాయిల్తో చేసిన జంక్ ఫుడ్‌కు ప్రజలు బాగా బానిసలవుతున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విదేశాల్లో ఆహార పదార్థాల విషయంలో కఠినమైన చట్టాలు అమల్లో ఉన్నాయి. పామాయిల్లో ఉండే పాల్మిటిక్ యాసిడ్ మనిషి ప్రాణాలను తీస్తుందని పరిశోధకులు తేల్చారు. పామాయిల్తో చేసిన పదార్థాలు పిల్లల మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. 

చిన్న వయసులోనే డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాల్లో సగం డయాబెటిస్, గుండె జబ్బుల వల్లే సంభవిస్తున్నాయి. ఈ విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు దేశవ్యాప్తంగా లక్ష మంది వైద్యులు ప్రధాని మోదీకి లేఖ రాశారు.

పామాయిల్ పామ్ ఫ్రూట్ నుంచి తీస్తారు. ఇది అన్ని రకాల నేలల్లోనూ పుష్కలంగా పెరుగుతుంది. దీని ఉత్పత్తి కూడా ఎక్కువ. ఇతర నూనెలతో పోలిస్తే ధర తక్కువగా ఉంటుంది. అయితే, ఇందులో కేలరీలు ఎక్కువ. మన శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు చేరడం వల్ల శారీరక శ్రమ లేకపోతే ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు వస్తాయి.

వైద్యుల సూచనల ప్రకారం పామాయిల్ వినియోగం తగ్గించుకోవడం మంచిది. ఇతర నూనెలతో పోలిస్తే పామాయిల్లో 34 శాతం ఫ్యాట్ ఉంటుంది. అదే ఆలివ్ నూనెలో సగం మాత్రమే ఉంటుంది. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో ఎక్కువగా పామాయిల్నే ఉపయోగిస్తున్నారు. చాక్లెట్ల తయారీలోనూ దీని వినియోగం ఎక్కువ. 

పామాయిల్ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆకలి బాగా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పామాయిల్ వినియోగాన్ని తగ్గించుకోవడం లేదా పూర్తిగా మానుకోవడం ఉత్తమమం అని సూచిస్తున్నారు వైద్యనిపుణులు.

 

ఇది కూడా చదవండి..పురుషులతో పోలిస్తే..మహిళల్లో కంటి సంబంధిత సమస్యలు పెరగడానికి కారణాలేమిటి..?

ఇది కూడా చదవండి..బర్డ్ ఫ్లూ వైరస్ ఎన్ని డిగ్రీల సెల్సియస్ వరకు సజీవంగా ఉంటుంది..?

ఇది కూడా చదవండి..జాయింట్ పెయిన్స్ తగ్గించే సూపర్ ఫుడ్స్.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి

Tags : palm-oil cooking-oil reused-oil bad-cholesterol indian-toilet western-toilet oily-food recycled-cooking-oil good-cholesterol cholesterol how-to-lower-cholesterol-naturally castor-oil-uses-and-benefits palm-oil-side-effects palm-oil-benefits side-effects-with-palm-oil palm-oil-benefits-and-side-effects red-palm-oil side-effects-of-palm-oil sustainable-palm-oil palm-oil-side-effects-in-telugu side-effects-of-palm-oil-
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com