పచ్చి పాలు పోషకాల పవర్‌హౌస్.. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : సాధారణంగా పాలను కాచి తాగడానికి ఇష్టపడతారు. కానీ, పచ్చి పాలు (Raw Milk) తాగడం వల్ల కూడా (health benefits) ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి. ఒకప్పుడు పచ్చి పాలను సురక్షితమైనవిగా భావించేవారు, కానీ కాలక్రమేణా పశువుల ఆహారంలో మార్పులు రావడంతో పాలను కాచి తాగడం మొదలుపెట్టారు. అయితే, దాని అర్థం పచ్చి పాలు ఆరోగ్యానికి హానికరం అని కాదు.

ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

పచ్చి పాలు (Raw Milk) చాలా రుచిగా ఉండడమే కాకుండా, పోషకాలతో నిండి ఉంటాయి. వీటిలో క్రియాశీల ఎంజైమ్‌లు, బయో అవైలబుల్ (vitamins)విటమిన్లు, (minarals)మినరల్స్ ఉంటాయి. అలాగే, ఇవి ల్యాక్టోజ్‌ను జీర్ణం చేయడంలో సహాయపడే మంచి బ్యాక్టీరియాను కలిగి ఉంటాయి.

పచ్చి పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..  

యాంటీబయోటిక్స్ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తాయి: పచ్చి పాలు యాంటీబయోటిక్స్ వాడకం వల్ల కలిగే (side effects) దుష్ప్రభావాలను తగ్గించడంలో సహాయపడతాయి.

గట్ ఆరోగ్యం: వీటిలో(Gut) గట్‌కు మేలు చేసే ప్రోబయోటిక్స్, ఎంజైమ్‌లు ఉంటాయి.

ఆరోగ్యకరమైన కొవ్వులు: వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.

పోషకాలతో నిండి: (Vitmain A)విటమిన్ ఎ, మెగ్నీషియం, జింక్, థయామిన్ వంటి అనేక పోషకాలు ఇందులో ఉంటాయి.

ఎముకల బలం: ఎముకలను బలంగా ఉంచేందుకు అవసరమైన కాల్షియం, విటమిన్ డి, ఫాస్పరస్, మెగ్నీషియం ఇందులో ఉంటాయి.

ల్యాక్టోస్ జీర్ణక్రియ (Lactose digestion): పచ్చి పాలు ల్యాక్టోస్ ఇన్టోలెరెన్స్‌ను పెంచకుండా, ల్యాక్టోజ్‌ను సులభంగా జీర్ణం చేయడంలో సహాయపడతాయి.

నాణ్యమైన ప్రోటీన్ (Quality protein) : ఇందులో 9 ముఖ్యమైన అమినో ఆమ్లాలు ఉన్న నాణ్యమైన (protein)ప్రోటీన్ ఉంటుంది.

ఆస్తమా, అలర్జీల నుంచి రక్షణ: పచ్చి పాలు ఆస్తమా, అలర్జీల నుంచి కూడా రక్షణ కల్పిస్తాయి.

(pasteurization process of milk) పాశ్చురైజేషన్ ప్రక్రియ వల్ల నష్టాలు ఏంటి..?   

పాశ్చురైజేషన్ ప్రక్రియలో పాలను స్టెరిలైజ్ చేయడం వల్ల ప్రోటీన్‌లు విరిగిపోతాయి (denature), అలాగే కొన్ని ఖనిజాలు కూడా నశించిపోతాయి. ఇలా విరిగిన ప్రోటీన్‌లను జీర్ణం చేసుకోవడం కష్టం అవుతుంది. సరిగా పోషించిన ఆరోగ్యకరమైన ఆవు పాలను పచ్చివిగా తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యనిపుణులు చెబుతున్నారు.

 

ఇది కూడా చదవండి.. మైగ్రేన్ పెయిన్ కు గుండెపోటుకు లింక్ ఏంటి..?

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 

ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..  

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.