Prostate Cancer : పట్టణాల్లో పెరుగుతున్న ‘ప్రోస్టేట్’ క్యాన్సర్..! హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : పట్టణాల్లోని పురుషులను ప్రోస్టేట్ క్యాన్సర్ మహమ్మారి తీవ్రంగా కలవరపెడుతోంది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. వ్యాధి లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడం, పరీక్షల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల పరిస్థితి విషమిస్తోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో దీని తీవ్రత మరీ ఎక్కువగా ఉంటోందని గణాంకాలు చెబుతున్నాయి.

ఆందోళన రేకెత్తిస్తోన్న గణాంకాలు.. 

నిమ్స్ (NIMS) గణాంకాల ప్రకారం.. నగరంలోని పురుషుల్లో కనిపిస్తున్న మొత్తం క్యాన్సర్ కేసుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ వాటా 6.9 శాతానికి చేరింది. 2026 నాటికి తెలంగాణలో కేవలం పురుషుల్లోనే కొత్తగా 21,252 క్యాన్సర్ కేసులు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. స్త్రీ, పురుషులిద్దరినీ కలిపి చూస్తే ఈ సంఖ్య 46,762కి చేరవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇంతటి తీవ్రత ఉన్నప్పటికీ, స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య కేవలం 4 శాతం లోపే ఉండటం గమనార్హం.

 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది రోగులు 4వ దశలో (Advanced Stage) ఆస్పత్రులకు వస్తున్నారు. దీనివల్ల చికిత్స క్లిష్టతరంగా మారి మరణాల రేటు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రోస్టేట్ క్యాన్సర్ ముదిరిన కేసుల్లో దాదాపు 65 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

"ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రారంభ దశలో ప్రాణాంతకం కాదు. ఆ సమయంలో గుర్తిస్తే నయం చేసే అవకాశం ఉంటుంది. కానీ వయసుతో పాటు వచ్చే సమస్యలే కదా అని లక్షణాలను విస్మరించడం వల్ల రోగులు ఆఖరి నిమిషంలో వైద్యులను సంప్రదిస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకోవడం ద్వారా ఈ ముప్పు నుంచి తప్పించుకోవచ్చుని మెడికల్ ఆంకాలజిస్ట్ డా.నిఖిల్ సురేష్ ఘడ్యాల్‌పాటిల్ చెబుతున్నారు. 

ప్రధాన కారణాలు ఇవే..

కొవ్వు అధికంగా ఉండే జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం.ఆరోగ్య సమస్యలు, ఊబకాయం, మధుమేహం, ధూమపానం.కూరగాయలు, పీచు పదార్థాలు తక్కువగా తీసుకోవడం.

గుర్తించాల్సిన ప్రాథమిక లక్షణాలు.. 

ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి..తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి రావటం ముఖ్యంగా రాత్రి వేళల్లో,మూత్ర ప్రవాహం బలహీనంగా ఉండటం, పెల్విక్ భాగంలో అసౌకర్యంగా అనిపించడం..

పరిష్కారం ఏంటి..?

వైద్య రంగంలో శస్త్రచికిత్స, రేడియేషన్, హార్మోనల్ థెరపీ వంటి అత్యాధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ముందస్తు గుర్తింపే అన్నిటికంటే కీలకం. 2026 నాటికి దేశవ్యాప్తంగా క్యాన్సర్ మరణాలు 7.05 లక్షలకు చేరతాయని అంచనాలు ఉన్న నేపథ్యంలో, సాధారణ ఆరోగ్య పరీక్షల్లో ప్రోస్టేట్ స్క్రీనింగ్‌ను తప్పనిసరి చేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.