Rising Thalassemia Cases Worldwide: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తలసేమియా కేసుల సంఖ్య.. కారణం ఇదే.. 

షేర్ చేయండి:
Rising Thalassemia Cases Worldwide: ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న తలసేమియా కేసుల సంఖ్య.. కారణం ఇదే.. 

సాక్షి లైఫ్ : మన శరీరంలోని ప్రతి అవయవం సజావుగా పనిచేయ డానికి రక్త ప్రసరణే కీలకం. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్, ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరం అంతటా చేరవేస్తుంది. ఈ వ్యవస్థలో లోపం తలెత్తితే వచ్చే తీవ్రమైన రుగ్మతే 'తలసేమియా'. ఈ వ్యాధి సోకిన వారిలో శరీరం తగినంత హిమోగ్లోబిన్‌ను ఉత్పత్తి చేయలేదు. ఫలితంగా తీవ్ర రక్తహీనత ఏర్పడి, బాధితులు నిరంతరం రక్త మార్పిడిపైనే బతకాల్సి వస్తుంది. శరీరానికి ఆక్సిజన్ అందించే హిమోగ్లోబిన్ ఉత్పత్తి తగ్గిపోతే..? జీవితాంతం రక్త మార్పిడిపైనే ఆధారపడాల్సి వస్తే..? అదే 'తలసేమియా'. ప్రపంచవ్యా ప్తంగా చాపకింద నీరులా విస్తరిస్తున్న ఈ జన్యు వ్యాధిపై ప్రత్యేక కథనం.. 

 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

ఏటా వేల సంఖ్యలో కొత్త కేసులు..

 ప్రపంచవ్యాప్తంగా సుమారు 13 లక్షల మందికి పైగా ఈ వ్యాధితో పోరాడుతున్నారు. ఒక్క మన దేశంలోనే ఏటా 40 వేల మందికి పైగా చిన్నారులు తలసేమియాతో జన్మిస్తున్నారు. ఈ ముప్పుపై అవగాహన కల్పించేందుకే ప్రతి ఏటా మే 8న 'అంతర్జాతీయ తలసేమియా దినోత్సవం' నిర్వహిస్తున్నారు.

రకాలు - లక్షణాలు..?

తలసేమియా ప్రధానంగా రెండు రకాలుగా ఉంటుంది. తలసేమియా మైనర్..వీరికి వ్యాధి లక్షణాలు తక్కువగా ఉంటాయి. వీరు సాధారణ జీవితాన్ని గడపవచ్చు, కానీ వీరు తర్వాతి తరాలకు ఈ వ్యాధిని మోసుకెళ్లే 'క్యారియర్లు'గా ఉంటారు. తలసేమియా మేజర్..ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. వీరికి క్రమం తప్పకుండా రక్త మార్పిడి అవసరం. లేని పక్షంలో ప్రాణాపాయం పొంచి ఉంటుంది.

లక్షణాలు ఎలా ఉంటాయంటే..?  

నిరంతర అలసట, బలహీనత, చర్మం పాలిపోయినట్లుగా ఉండటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండె వేగంగా కొట్టుకోవడం. పిల్లల్లో ఎదుగుదల లోపించడం అంటే ఎత్తు, బరువు తక్కువగా ఉండటం.

పెళ్లికి ముందు పరీక్షే పరిష్కారం..!

తలసేమియా అనేది ఒక జన్యుపరమైన వ్యాధి. అంటే ఇది తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తుంది. అందుకే వివాహానికి ముందు వధూవరులు రక్త పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. తల్లిదండ్రులిద్దరూ తలసేమియా క్యారియర్లు మైనర్ అయితే, పుట్టబోయే బిడ్డకు తలసేమియా మేజర్ వచ్చే అవకాశం 25 శాతం ఉంటుంది. గర్భధారణ సమయంలోనూ పరీక్షలు నిర్వహించడం ద్వారా శిశువు ఆరోగ్య పరిస్థితిని ముందే తెలుసుకోవచ్చు.

నివారణ సాధ్యమేనా..?

దురదృష్టవశాత్తు తలసేమియాను పూర్తిగా నయం చేయడం కష్టం. కానీ సరైన జాగ్రత్తలతో నియంత్రించవచ్చు. క్రమబద్ధమైన రక్త మార్పిడి: మేజర్ బాధితులకు వైద్యుల సలహా మేరకు తరచుగా రక్తం ఎక్కించాలి.

జన్యు సలహా (Genetic Counseling)..కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధి ఉన్నట్లయితే, పిల్లల విషయంలో నిపుణుల సలహాలు తీసుకోవాలి. తరచుగా రక్త మార్పిడి వల్ల శరీరంలో ఇనుము (Iron) పేరుకుపోయే ప్రమాదం ఉంది. దీనిని నియంత్రించేందుకు మందులు వాడాలి. తలసేమియా బాధితులకు మనం అందించే రక్తదానమే పునర్జన్మ నిస్తుంది. ముందస్తు పరీక్షలు, అవగాహనతో ఈ మహమ్మారిని భవిష్యత్ తరాలకు సోకకుండా అడ్డుకుందాం.. 

 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.