Digestive Problems : ఉదర సమస్యలకు సరైన పరిష్కారాన్ని అందించే చిట్కా.. !
సాక్షి లైఫ్ : మారిన ఆహారపు అలవాట్లు మన జీర్ణవ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. వేళాపాళా లేని భోజనం, జంక్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, తగినంత నీరు తాగకపోవడం వల్ల ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం. దీని నివారణకు మందుల వాడకం తాత్కాలికమే అయినా, దీర్ఘకాలంలో ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అయితే, మన వంటింట్లో లభించే ఒక అద్భుత ఔషధంతో ఈ సమస్యకు స్వస్తి పలకవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..?
ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?
నల్ల ఎండు ద్రాక్ష..
ప్రముఖ డైటీషియన్ల అభిప్రాయం ప్రకారం.. మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి నల్ల ఎండు ద్రాక్ష ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ఇది కేవలం మలవిసర్జనను సులభతరం చేయడమే కాకుండా, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది.
ఎందుకు తీసుకోవాలి..?
నల్ల ఎండు ద్రాక్షలో దాగి ఉన్న పోషకాలు ప్రేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ఇందులో పీచు అధికంగా ఉండటం వల్ల మలం మృదువుగా మారి, ప్రేగు కదలికలు సాఫీగా జరుగుతాయి.
సార్బిటాల్ (Sorbitol).. సహజసిద్ధమైన విరేచనకారిగా పనిచేసి, మలబద్ధకం నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు..ఇవి శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి, జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
మంచి బ్యాక్టీరియా..పొట్టలో మేలు చేసే బ్యాక్టీరియా వృద్ధికి ఇవి తోడ్పడతాయి.రోజూ సరైన మలవిసర్జన జరగడం అనేది సంపూర్ణ ఆరోగ్యానికి సంకేతం. నల్ల ఎండు ద్రాక్షను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ఉదర సమస్యల నుంచి బయటపడవచ్చని డైటీషియన్లు చెబుతున్నారు.
జీర్ణక్రియకు..
ఎండు ద్రాక్షతో పాటు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగడం ముఖ్యం.ఆహారంతో పాటు స్వల్ప వ్యాయామం జీర్ణక్రియకు మరింత సహాయపడుతుంది.సమస్య తీవ్రంగా ఉంటే సొంత వైద్యం కంటే నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం. మందులపై ఆధార పడకుండా, ఇలాంటి సహజసిద్ధమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మీ వంటింట్లో ఉండే ఈ చిన్న చిట్కా.. పెద్ద మార్పును తీసుకువస్తుంది.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?
ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
