Sinusitis : సైనసైటిస్‌ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?   

షేర్ చేయండి:
Sinusitis : సైనసైటిస్‌ని నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?   

సాక్షి లైఫ్ : సైనసైటిస్‌కు అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లక్షణాలతో పాటుఎంతకాలంగా ఆ సమస్య ఉంది..? అనే దానిపై ఆధారపడి చికిత్స  చేస్తారు. సైనసైటిస్‌ని నిర్ధారించడానికి నాజల్ ఎండోస్కోపీ, కంప్యూటెడ్ టోమోగ్రఫీ (సీటీ)స్కాన్‌, అలెర్జీ టెస్ట్, బయాప్సి టెస్టు వంటివి చేస్తారు. 

ఇది కూడా చదవండి.. లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి.. గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు.. 

సైనస్ ఇన్ఫెక్షన్ లో రకాలు.. ?

 సైనస్ ఇన్ఫెక్షన్ రకం అది ఎంతకాలం నుంచి ఉంది..? తరచుగా వస్తుందా..? అనే దానిపై ఆధారపడి ఉంటుంది.

అక్యూట్ సైనస్: అమెరికన్ అకాడమీ ఆఫ్ ఒటోలారిన్జాలజీ ప్రకారం, ఈ రకమైన సైనస్ ఇన్ఫెక్షన్ 4 వారాల కంటే తక్కువగా ఉంటుంది. ఇది సాధారణంగా జలుబు లేదా ఇతర శ్వాసకోశ అనారోగ్యంలో భాగంగా పరిగణిస్తారు.  

సబాక్యూట్ సైనసైటిస్‌: సబాక్యూట్ సైనస్ ఇన్ఫెక్షన్ 4 నుంచి 12 వారాల మధ్య ఉంటుంది.

రికరెంట్ అక్యూట్ సైనసైటిస్‌ : ఇన్ఫెక్షన్ ఒక సంవత్సరంలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ సార్లు తిరిగి వచ్చినట్లయితే, ప్రతి ఇన్ఫెక్షన్ 7 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటే, తీవ్రమైన సైనస్ ఇన్ఫెక్షన్ ను రికరెంట్ అక్యూట్ సైనసైటిస్‌గా పరిగణిస్తారు.

క్రానిక్ సైనసైటిస్‌: క్రానిక్ సైనస్ ఇన్ఫెక్షన్లు 12 వారాల కంటే ఎక్కువ కాలం పాటు కొనసాగుతాయి. లేదా పునరావృతమవుతూ ఉంటాయి.

 ఇది కూడా చదవండి.. ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి మంచిది..?

 ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

 ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.