సాక్షి లైఫ్ : సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా కణజాలాల వాపు వస్తుంది. అంతేకాకుండా ముక్కులోపల నొప్పి, ముక్కు మూసుకుపోవడం లేదా ముక్కు కారటం, కొన్నిసార్లు జ్వరం రావడం కూడా జరుగుతుంది. ఇది జలుబు చేసిన సమయంలో మరింత ఇబ్బంది పెడుతుంది. అయితే ఇతర వైరస్‌లు, బ్యాక్టీరియా, ఫంగస్, అలర్జీలు సైనసైటిస్‌కు కారణమని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.