టాయిలెట్‌ కమోడ్ పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్ ప్రమాదం  పెరుగుతుందా..?

షేర్ చేయండి:
టాయిలెట్‌ కమోడ్ పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పైల్స్ ప్రమాదం  పెరుగుతుందా..?

సాక్షి లైఫ్ : మల విసర్జన కోసం టాయిలెట్‌కి వెళ్ళినప్పుడు, మొబైల్ ఫోన్ చూడటం నేటి తరం యువతలో అలవాటుగా మారిపోయింది. కానీ, ఈ అలవాటు మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో చాలామందికి తెలియదు. టాయిలెట్‌పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల, ముఖ్యంగా ఫోన్ చూస్తూ సమయాన్ని గడపడం వల్ల పైల్స్ (Hemorrhoids) వచ్చే ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి..మెనోపాజ్ సమయంలో మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు చేసుకోవాలి..?

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

 

ఎందుకు పెరుగుతుంది అంటే..?

సాధారణంగా, మల విసర్జన ప్రక్రియకు రెండు నుంచి మూడు నిమిషాల సమయం సరిపోతుంది. కానీ, మొబైల్ ఫోన్ చూసే అలవాటు వల్ల చాలామంది 10, 15 నిమిషాల కంటే ఎక్కువ సమయం టాయిలెట్‌కమోడ్ పై కూర్చుంటారు. 

ఎక్కువ సమయం టాయిలెట్‌పై కూర్చోవడం వల్ల కలిగే ప్రధాన సమస్యలు..  


ఒత్తిడి పెరుగుతుంది: టాయిలెట్‌పై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పురీషనాళం (rectum) పాయువు (anus) చుట్టూ ఉన్న సిరలపై నిరంతర ఒత్తిడి పడుతుంది. ఈ ఒత్తిడి వల్ల సిరలు ఉబ్బి, వాపునకు గురవుతాయి. ఇదే పైల్స్ లేదా మొలలు అంటారు.

పరధ్యానం: ఫోన్‌లో లీనమై ఉండటం వల్ల మల విసర్జన ప్రక్రియపై సరైన దృష్టి ఉండదు. దీని వల్ల మలం పూర్తిగా బయటకు వెళ్లకపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ఒత్తిడి పైల్స్ ప్రమాదాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణకు ఆటంకం: ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల శరీరంలోని ముఖ్యంగా దిగువ భాగంలో రక్త ప్రసరణ మందగిస్తుంది. ఇది కూడా సిరలు ఉబ్బడానికి కారణమవుతుంది.

ఇది కూడా చదవండి..Menopause : మెనో పాజ్ వల్ల కూడా డిప్రెషన్ కు గురవుతారా..?

ఇది కూడా చదవండి..For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?

ఇది కూడా చదవండి..ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..? 

ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.