ఈ 5 ఆహారాలు మీ బరువును సులభంగా తగ్గిస్తాయి.. 

షేర్ చేయండి:
ఈ 5 ఆహారాలు మీ బరువును సులభంగా తగ్గిస్తాయి.. 

సాక్షి లైఫ్ : వేగంగా మారుతున్న జీవనశైలి, వర్క్ కల్చర్ కారణంగా చాలామంది స్థూలకాయం బారీన పడుతున్నారు. ఇది యావత్ ప్రపంచానికి ఆందోళన కలిగించే తీవ్రమైన సమస్య. ఊబకాయం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల దీనిని నియంత్రించటం చాలా ముఖ్యం. బరువును తగ్గించే ఐదు ప్రభావవంతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుంటు న్నారు. వేగంగా పెరుగుతున్న బరువుతో బాధపడుతున్న వ్యక్తులు ఈ రోజుల్లో తమ ఆరోగ్యంపై ఎక్కువగా శ్రద్ధ పెడుతున్నారు. ఊబకాయం అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందుకే తప్పనిసరిగా  దీనిని నియంత్రించాలి. తద్వారా తీవ్రమైన వ్యాధులను నివారించవచ్చు.  

బరువు తగ్గడం విషయానికి వస్తే, కొన్ని ఆహారాలు మీ ఆకలిని తగ్గించడంపై దృష్టి పెడతాయి, అయితే కొన్ని ఆహారాలు మీ కొవ్వు, కేలరీలు, చక్కెర తీసుకోవడంపై దృష్టి పెడతాయి. అయితే వీటన్నింటి ప్రధాన లక్ష్యం బరువు తగ్గడమే.  

 వెజిటబుల్ హెవీ డైట్.. 

 వెజిటబుల్ హెవీ డైట్.. దీని ప్రకారం మాంసం వినియోగాన్ని తగ్గించాలి. కానీ నాన్ వెజ్ ఫుడ్ ను పూర్తిగా మానేయకూడదు. ఈ ఆహారంలో, చికెన్‌కు బదులుగా చేపలను తినాలి. అంతేకాదు తృణధాన్యాలు, గింజలు మొలకెత్తిన గింజలు తినాలి.


ముడి ఆహారం
 
ముడి ఆహారం.. ప్రాసెస్ చేయని ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కెమికల్స్, ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహారపదార్తలకు దూరంగా ఉండాలి. ఇది ఆహారంలో క్యాన్సర్ కారకాలను తగ్గిస్తుంది.

తక్కువ కార్బ్ ఆహారం.. 

 కార్బోహైడ్రేట్ ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. ఇది బరువును తగ్గించడంలో సహాయపడుతుంది.

  ఉపవాసం..

అడపాదడపా ఉపవాసంలో ఉపవాస చక్రాల ప్రకారం ఆహారాన్ని తింటారు. ఇవి కూడా అనేక రకాలున్నాయి. 16:8, 5:2, వారియర్ డైట్ మొదలైనవి. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి వేర్వేరు ప్రమాణాలు ఉంటాయి.  

మొక్కల ఆధారిత ఆహారం.. 

దీనిని వేగన్ డైట్ అని కూడా అంటారు. ఇది ఒక రకమైన శాఖాహార ఆహారం, దీనిలో ప్రజలు నాన్ వెజ్‌తో పాటు గుడ్లు, పాల ఉత్పత్తులను ఉపయోగించరు. తద్వారా కొలెస్ట్రాల్, కొవ్వు పదార్థాలు దూరంగా ఉండాలి.   

ఇది కూడా చదవండి..40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..కొత్తగా దంతాలు వచ్చిన పిల్లలకూ బ్రష్ చేయాలా..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.