న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
సాక్షి లైఫ్ : కొన్నిరకాల క్యాన్సర్లు ఆల్కహాల్‌తో ముడిపడి ఉంటాయని ఇటీవల జరిగిన అధ్యయనంలో తేలింది. అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రీసెర్చ్ (ఏఏసిఆర్) క్యాన్సర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024 ప్రకారం, మొత్తం క్యాన్సర్ కేసులలో 5శాతం కంటే ఎక్కువ మద్యం వినియోగంతోనే ముడిపడి ఉన్నాయని వెల్లడైంది. అటువంటివాటిలో ఆరు రకాల క్యాన్సర్‌లకు మద్యమే ప్రధాన కారణమని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?
ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..
ఏఏసిఆర్ క్యాన్సర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024..
ఏఏసిఆర్ క్యాన్సర్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024 ప్రధాన రచయిత రాజర్షి సేన్‌గుప్తా అధిక మద్యపానం వల్ల పలురకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. నెక్ ,ఈసోఫేగల్ స్కామోస్ సెల్ కర్సినోమా, బ్రెస్ట్ , కొలొరెక్టల్ లివర్, స్టమక్ క్యాన్సర్ వంటి ఆరు రకాల క్యాన్సర్లు ఆల్కహాల్ ఎక్కువగా తాగడం వల్లే వస్తాయని అధ్యయన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆల్కహాల్ అనేది ఆరు రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్నిపెంచుతుంది.
మద్యం వల్ల వచ్చే క్యాన్సర్‌లు..?
రెగ్యులర్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పలు రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) హెచ్చరించింది. రోజుకు మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కడుపు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఆల్కహాల్ తాగడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్ రిస్క్ కూడా పెరుగుతుందట. రెడ్ అండ్ వైట్ వైన్, బీర్ తో సహా అన్ని రకాల ఆల్కహాలిక్ పానీయాలు క్యాన్సర్‌తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరిగా మద్యానికి దూరంగా ఉండడం మేలని పరిశోధకులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
