Severe Dengue Warning Signs : డెంగీ తీవ్రతను తెలిపే ప్రమాదకర లక్షణాలు ఇవిగో.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలంలో దోమల వ్యాప్తి పెరిగి డెంగీ, మలేరియా లాంటి విషజ్వరాలు వేగంగా ప్రబలుతున్నాయి. డెంగీ అనగానే కేవలం ప్లేట్‌లెట్స్ తగ్గడమే ప్రధాన ప్రమాదకరం అని చాలామంది భావిస్తారు, కానీ శరీరంలో కనిపించే మరికొన్ని తీవ్రమైన లక్షణాలను సైతం ఏమాత్రం విస్మరించకూడదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కడుపులో తీవ్రమైన నొప్పి.. జ్వరం ఉన్నప్పుడు లేదా తగ్గిన తర్వాత అకస్మాత్తుగా కడుపులో భరించలేని నొప్పి రావడం డెంగీ తీవ్రతకు స్పష్టమైన సంకేతం.

 

ఇది కూడా చదవండి..Don’t Ignore Fever : సాధారణ జ్వరమే కదా అని నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ముప్పు..! ఈ 5 లక్షణాలపై అవగాహన అవసరం.. 

ఇది కూడా చదవండి..Online Shopping Addiction : ఆన్‌లైన్ షాపింగ్ వ్యసనం వెనుక దాగి ఉన్న సీక్రెట్ సైకాలజీ ఏం చెబుతోంది..?

ఇది కూడా చదవండి..కాలేయ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారా..? మౌనంగా పెరుగుతున్న ఈ వ్యాధి గురించి తెలుసా..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

నిరంతర వాంతులు..  
 
పదే పదే వాంతులు కావడం వల్ల శరీరంలో ద్రవాలు తగ్గిపోయి రోగి డీహైడ్రేషన్ (Dehydration) బారిన పడే ప్రమాదం ఉంటుంది.

అసాధారణ రక్తస్రావం..

ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారడం లేదా వాంతులు, మలంలో రక్తం పడటాన్ని అత్యంత ప్రమాదకరమైనదిగా గుర్తించాలి. ఇది అంతర్గత రక్తస్రావానికి సూచన.

తీవ్రమైన అలసట, మైకం..

 రక్తపోటు (bp) అకస్మాత్తుగా పడిపోవడం వల్ల తీవ్రమైన నీరసం, కళ్లు తిరగడం, నిస్సత్తువ ఆవరించడం లేదా స్పృహ తప్పడం (shock syndrome) వంటివి జరుగుతాయి.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

ఛాతీ లేదా పొట్ట భాగంలో ద్రవాలు చేరడం వల్ల ఊపిరి పీల్చుకోవడం కష్టంగా మారుతుంది. ఆయాసం వస్తే తక్షణ వైద్య సహాయం అవసరం.

జ్వరం తగ్గాకే అసలైన ముప్పు..

డెంగీ బారిన పడిన రోగుల్లో జ్వరం తగ్గిపోగానే వ్యాధి పూర్తిగా నయమైపోయిందని చాలామంది పొరబడుతుంటారు. కానీ, డెంగీలో అసలైన ముప్పు జ్వరం తగ్గిన 24 నుంచి 48 గంటల తర్వాతే మొదలవుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఈ కీలక సమయంలోనే రక్తనాళాల నుంచి ద్రవాలు బయటకు లీక్ కావడం (capillary leakage) జరుగుతుంది.

 ప్లేట్‌లెట్స్ సంఖ్యను బట్టి..

కేవలం ప్లేట్‌లెట్స్ సంఖ్యను బట్టి మాత్రమే డెంగీ ప్రమాద తీవ్రతను అంచనా వేయలేము. జ్వరం తగ్గిన తర్వాత పైన పేర్కొన్న వాంతులు, కడుపు నొప్పి, రక్తస్రావం, అలసట వంటి ఏ ఒక్క లక్షణం కనిపించినా ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఇంట్లోనే ఉండి సొంత వైద్యం లేదా నొప్పి నివారణ మాత్రలు వేసుకోకుండా తక్షణం రోగిని ఆసుపత్రికి తరలించి, వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్స అందించాలి. తగినన్ని ద్రవ పదార్థాలు ఇస్తూ నిరంతరం గమనిస్తూ ఉండటం ద్వారా ప్రాణాపాయం నుంచి రోగిని సురక్షితంగా కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.