సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే పండు..  

షేర్ చేయండి:
సహజంగా రోగనిరోధక శక్తిని పెంచే పండు..  

సాక్షి లైఫ్ : ఆహారం, ఆరోగ్యం ఒకదానితో మరొకదానికి లింక్ ఉంటుంది. చాలా కాలంగా, వైద్యులు, శాస్త్రవేత్తలు ఆరోగ్యకరమైన, సుదీర్ఘమైన , ఎలాంటి  వ్యాధి లేని జీవితాన్ని గడపడానికి పండ్లు, కూరగాయలను తినడం ఉత్తమమైన మార్గమని చెబుతున్నారు. కానీ కొన్ని అద్భుతమైన ఆరోగ్యకరమైన ఆహారాలు వాటికి తగిన గుర్తింపును పొందవు. అలాంటి పండ్లలో కివీ పండు ఒకటి. ఈ పండులో విటమిన్ "సి", యాంటీ ఆక్సిడెంట్లకు అద్భుతమైన మూలం.

 ఇది కూడా చదవండి.. శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌లను గుర్తించడానికి రక్త పరీక్షల కంటే లాలాజల పరీక్షలతోనే మెరుగైన ఫలితాలు

 ఇది కూడా చదవండి.. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల బరువు తగ్గుతారా..? 

 ఇది కూడా చదవండి.. ఉదయాన్నే ప్రోటీన్-రిచ్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటే ఈ ఏడు బెనిఫిట్స్ పొందవచ్చు.. 

 ఇది కూడా చదవండి.. మీరు చికెన్ లివర్ తింటున్నారా? ఈ విషయాలు తెలుసుకోవాలి..

రోగనిరోధక శక్తి..

రోగనిరోధక శక్తిని పెంచడమేకాకుండా జీర్ణసంబంధిత సమస్యలను అరికట్టడానికి అవసరమైన పోషకాలు ఇందులో ఉంటాయి. పేగు ఆరోగ్యానికి కూడా ఇది అద్భుతమైనదని నిపుణులు చెబుతున్నారు.

కివీ ఫ్రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు.. 

గట్ హెల్త్ కు ఉత్తమమైన పండు. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి, డెంగ్యూ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి, త్వరగా కోలుకోవడానికి వైద్యులు తరచుగా కివీ పండు తినాలని సిఫార్సు చేస్తారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రోజులో కనీసం ఒక కివీ పండు అయినా తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగైన నిర్వహణకు సహాయపడు తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

ఒక రోజులో రెండు కివీ పండ్లు తీసుకోవడం ద్వారా  శరీరానికి తగినంత పీచుపదార్థం అందుతుంది. తద్వారా ఎలాంటి జీర్ణ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి.

 ఇది కూడా చదవండి.. థైరాయిడ్ సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి..?

 ఇది కూడా చదవండి.. హెల్తీ డైట్: పిల్లల పెరుగుదలకు సహాయపడే ఆహారం..

 ఇది కూడా చదవండి.. కొలెస్ట్రాల్ అంటే ఏమిటి..? ఇది ఎన్ని రకాలు..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.