Rheumatoid Arthritis : రుమటాయిడ్ ఆర్థరైటిస్ నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేసే మొక్క..
సాక్షి లైఫ్ : బ్రెజిల్ తీర ప్రాంతాల్లో లభించే ఒక సంప్రదాయ మ్యాంగ్రోవ్ జాతికి చెందిన మొక్కను, తరతరాలుగా అక్కడి ప్రజలు వాపులు, నొప్పుల తగ్గడానికి వాడుతున్నారు. అయితే, తాజాగా జరిగిన శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ మొక్కలోని ఔషధ గుణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ (Rheumatoid Arthritis) వంటి మొండి నొప్పులను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తున్నాయని తేలింది.
ప్రధాన అంశాలు..
సహజసిద్ధమైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ.. ఈ మొక్కలోని రసాయన సమ్మేళనాలు శరీరంలోని వాపును కలిగించే ఎంజైమ్‌లను అడ్డుకుంటాయి. ఎలాంటి దుష్ప్రభావాలు లేని చికిత్స.. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీలు, కాలేయంపై పడే ప్రభావం ఈ సహజ ఔషధంతో ఉండదని ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. ఇది కేవలం నొప్పిని తగ్గించడమే కాకుండా, కీళ్ల మధ్య ఉండే మృదులాస్థి (Cartilage) అరిగిపోకుండా కాపాడుతుందని కనుగొన్నారు.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఆర్థరైటిస్ బాధితులకు ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే..?
మన దేశంలో కూడా కీళ్ల నొప్పులతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ పరిశోధన విజయవంతమైతే, భవిష్యత్తులో ఆర్థరైటిస్ కోసం తక్కువ ఖర్చుతో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని "నేచురల్ సప్లిమెంట్స్" అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇది ప్రస్తుతం శాస్త్రీయ పరిశోధనలో ఉంది. ఏదైనా కొత్త ఔషధాన్ని లేదా మూలికలను వినియోగించే ముందు తప్పనిసరిగా వైద్యనిపుణులను సంప్రదించాలి.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
