China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

సాక్షి లైఫ్ : మనిషి ఆయుష్షు వందేళ్లు కాదు..150 ఏళ్లు ఉంటుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెప్పే దిశగా చైనాలో జరుగుతున్న పరిశోధనలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశ మయ్యాయి. డ్రాగన్ కంట్రీకి చెందిన ఒక బయోటెక్ సంస్థ (Biotech Company) అభివృద్ధి చేస్తున్న 'యాంటీ ఏజింగ్' (Anti-Aging) మాత్ర.. మనిషి జీవిత కాలాన్ని గణనీయంగా పెంచే (Extend Lifespan) అవకాశం ఉందని చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..మైక్రోసైటిక్ అనీమియా అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. 40 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోవచ్చా..? 

ఇది కూడా చదవండి..నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

 

 ఏమిటి ఈ చైనా లాంజెవిటీ పిల్..?

షెన్‌జెన్ (Shenzhen) కేంద్రంగా పనిచేస్తున్న లాన్వీ బయోసైన్సెస్ (Lonvi Biosciences) అనే స్టార్టప్ కంపెనీ... తాము తయారు చేస్తున్న ఒక పిల్ (Pill) మనిషిని 150 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించేలా చేయగలదని ప్రకటించింది.

కీలక పదార్థం..  

పీసీసీ1 (PCC1): ఈ మాత్రలో ప్రధానంగా ప్రోసైనిడిన్ సి1 (Procyanidin C1) అనే సమ్మేళనాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది ద్రాక్ష గింజల సారం (Grape Seed Extract) నుంచి సేకరించిన సహజ పాలిఫెనాల్ (Polyphenol) పదార్థం.

జోంబీ సెల్స్‌పై ప్రయోగం..  

 PCC1 ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయే 'సేనసెంట్ సెల్స్' (Senescent Cells) లేదా "జోంబీ సెల్స్"ను ఎంపిక చేసి నాశనం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ జోంబీ కణాలు వృద్ధాప్యానికి, వివిధ వ్యాధులకు కారణమవుతాయి.

ఎలుకలపై పరిశోధన..  

 2021లో 'నేచర్ మెటాబోలిజం' (Nature Metabolism) జర్నల్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం..ఈ సమ్మేళనాన్ని తీసుకున్న ఎలుకల సగటు జీవితకాలం 9.4 శాతం పెరిగింది. చికిత్స తర్వాత వాటి జీవనకాలం ఏకంగా 64.2 శాతం పెరగడం గమనార్హం.

 అధ్యక్షుల మధ్య చర్చ... ప్రపంచ దృష్టి..  

ఈ దీర్ఘాయుష్య అంశంపై చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ (Vladimir Putin) మధ్య జరిగిన ఓ సంభాషణను మైక్రోఫోన్లు రికార్డు చేయడంతో ఈ పరిశోధన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అధునాతన బయోటెక్నాలజీ, అవయవ మార్పిడి ద్వారా మనిషి 150 ఏళ్లు జీవించవచ్చని జిన్ పింగ్ పేర్కొన్నట్లు తెలుస్తోంది.

లాన్వీ బయోసైన్సెస్ సీఈవో దీన్ని "లాంజెవిటీ సైన్స్ హోలీ గ్రెయిల్"గా అభివర్ణించినప్పటికీ, ఇతర అంతర్జాతీయ శాస్త్రవేత్తలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

మనుషులపై పరీక్షలు కీలకం..  

ఎలుకలపై చూపించిన ఫలితాలు మానవుల్లోనూ వస్తాయనడానికి గ్యారెంటీ లేదని, ఈ పిల్ భద్రత, సమర్థతను నిర్ధారించడానికి విస్తృతమైన మానవ క్లినికల్ ట్రయల్స్ (Human Clinical Trials) అవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.

 కేవలం మాత్రతోనే 150 ఏళ్లు జీవించడం కాదని, ఆరోగ్యకరమైన జీవనశైలి (Healthy Lifestyle) సరైన వైద్య చికిత్సలతో కలిపి ఈ మాత్రలు దీర్ఘాయుష్షుకు తోడ్పడతాయని లాన్వీ బయోసైన్సెస్ చెబుతోంది.

ఏది ఏమైనా, వృద్ధాప్యాన్ని జయించే ఈ శాస్త్ర పరిశోధనలు మానవాళికి కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. అయితే, పూర్తి స్థాయి పరిశోధనలు, ధ్రువీకరించేవరకు పకడ్బందీ ఆహారం, వ్యాయామమే ఆరోగ్యానికి ఉత్తమ మార్గమని నిపుణులు గుర్తు చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..ఒక వ్యక్తికి రోజుకి ఎన్ని కేలరీస్ అవసరం..? 

ఇది కూడా చదవండి..సిండ్రోమ్ Xకు ప్రారంభ దశలో ఎలాంటి చికిత్సను అందిస్తారు..?

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడిని ఫుడ్ చేంజెస్ చేయడం ద్వారా తగ్గించవచ్చా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : mental-health health-news-updates research health-research researchers new-research bharat-biotech anti-aging-food longevity-secrets anti-aging anti-aging-treatment anti-aging-problems anti-aging-issues latest-research nutrition-research anti-aging-serum anti-aging-skin-care china-scientists health-and-longevity china-longevity-pill-150-years pcc1-anti-aging-supplement lonvi-biosciences-pcc1-pill nature-metabolism-pcc1-study
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com