Type-5 Diabetes : కొత్త రకం మధుమేహం టైప్-5.. అసలేమిటీ వ్యాధి..?

షేర్ చేయండి:
Type-5 Diabetes : కొత్త రకం మధుమేహం టైప్-5.. అసలేమిటీ వ్యాధి..?

సాక్షి లైఫ్ : మధుమేహవ్యాధి అనగానే అందరికీ గుర్తొచ్చేది అతిగా తినడం లేదా ఊబకాయం. కానీ, దీనికి పూర్తి భిన్నంగా ‘పోషకాహార లోపం’ (Malnutrition) వల్ల వచ్చే కొత్త రకం డయాబెటిస్‌ను శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. బ్యాంకాక్‌లో జరిగిన అంతర్జాతీయ మధుమేహ సమాఖ్య (IDF) సదస్సులో ఈ కొత్త రకానికి చెందిన వ్యాధికి అధికారిక ముద్ర వేశారు.

ఇది కూడా చదవండి...Hair loss : జుట్టు రాలడాన్ని నిరోధించడానికి వైద్య చికిత్సలు ఎంతవరకు సురక్షితం..?

ఇది కూడా చదవండి...కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి.. 

 

ఎవరికి ముప్పు ఎక్కువ..?

సన్నగా ఉన్నవారు..అధిక బరువు ఉన్నవారికి కాకుండా, చాలా తక్కువ శరీర బరువు (BMI 18.5 కంటే తక్కువ) ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది.
ముఖ్యంగా 10 నుంచి 30 ఏళ్ల లోపు వయసున్న యువత, టీనేజర్లలో ఇది ఎక్కువగా బయటపడుతోంది. చిన్నతనంలో సరైన పౌష్టికాహారం లభించని వారిలో ప్యాంక్రియాస్ సరిగ్గా అభివృద్ధి చెందక, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల ఈ వ్యాధి వస్తుంది.

టైప్-1, టైప్-2ల కంటే ఎలా భిన్నం..?

సాధారణంగా టైప్-2 మధుమేహంలో శరీరం ఇన్సులిన్‌ను వాడుకోలేదు (Insulin Resistance). కానీ టైప్-5లో శరీరం ఇన్సులిన్‌కు బాగానే స్పందిస్తుంది, అయితే ప్యాంక్రియాస్ తగినంత ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయలేకపోవడమే ప్రధాన సమస్య. అలాగే టైప్-1 లాగా ఇది రోగనిరోధక వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు.

నిపుణులు ఏమంటున్నారు..?

వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ (CMC) అమెరికాలోని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.5 కోట్ల మంది ఈ టైప్-5 మధుమేహంతో బాధపడుతున్నట్లు అంచనా. సరైన అవగాహన లేక చాలా మంది దీనిని టైప్-1గా భావించి తప్పుడు చికిత్స తీసుకుంటున్నారు.

 లక్షణాలు..?  

విపరీతమైన నీరసం, అలసట. ఎంత తిన్నా బరువు పెరగకపోవడం.
వంశపారంపర్యంగా కాకుండా అకస్మాత్తుగా చక్కెర స్థాయిలు పెరగడం.
ఇతర రకాలకు ఇచ్చే ఇన్సులిన్ డోసు దీనికి సరిపోకపోవచ్చు లేదా వికటించవచ్చు.

చికిత్స ఎలా..?

టైప్-5 బాధితులకు కేవలం మందులు ఇస్తే సరిపోదు. శరీరానికి అవసరమైన ప్రొటీన్లు, విటమిన్లు కలిగిన పౌష్టికాహారాన్ని అందించడం ద్వారా దీనిని అదుపులో ఉంచవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. మీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే ఆలస్యం చేయకుండా నిపుణులైన ఎండోక్రైనాలజిస్ట్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోండి.

ఇది కూడా చదవండి...Expert Guidelines : విజృంభిస్తున్న కొత్త వైరస్ వేరియంట్: సబ్-క్లేడ్ కె నివారణకు నిపుణుల మార్గదర్శకాలు..!

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !

ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..? 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.