మంకీపాక్స్ కు వ్యాక్సిన్..
సాక్షి లైఫ్ : చికెన్‌పాక్స్ వ్యాక్సిన్ ఎం పాక్స్ విషయంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. చికెన్‌పాక్స్ నివారణలో ఉపయోగించే బవేరియన్ నార్డిక్ A/S వ్యాక్సిన్ మంకీపాక్స్ ఇన్‌ఫెక్షన్‌ను నివారించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించారు శాస్త్రవేత్తలు. బవేరియన్ నార్డిక్ A/S సంస్థ రుపొంచిందించిన వ్యాక్సిన్ "జిన్నెయెస్" కు ఆమోదం తెలిపింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. జపాన్ కు చెందిన మరొక ఫార్మా సంస్థ "ఎల్ సి16" వ్యాక్సిన్ ను కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పరిశీలిస్తోంది.
ఇది కూడా చదవండి..కృత్రిమ చక్కెర వాడితే ఏమౌతుంది..?
ఇది కూడా చదవండి..ఎంపాక్స్ ని నివారించే మార్గాలు..
ఇది కూడా చదవండి..ఇలాంటి జాగ్రత్తలు లేకపోతేనే మధుమేహ సమస్య వస్తుంది..?
58 శాతం రక్షణ..
అధ్యయనం ప్రకారం, ఈ టీకా మంకీ పాక్స్ (ఎంపాక్స్)సంక్రమణను నివారించడంలో 58 శాతం రక్షణగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ వ్యాక్సిన్ 2022లో మంకీ పాక్స్ వ్యాధి వ్యాప్తిని నిరోధించడంలో చాలా వరకూ సహాయపడింది. అయితే ప్రస్తుతం ప్రపంచదేశాల్లో పెరుగుతున్న మంకీ పాక్స్ ను నివారించడానికి ఈ బవేరియన్ నార్డిక్ A/S వ్యాక్సిన్ ని ఉపయోగించడం ద్వారా ప్రయోజనం పొందవచ్చని పరిశోధకులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
భారతదేశంలో మంకీ పాక్స్ వ్యాధి ప్రభావం..?
ఇప్పటి వరకు, మంకీ పాక్స్ వ్యాధి కేసులు భారతదేశంలో పరిమితంగా ఉన్నాయి. అయితే ఈ వ్యాధి పట్ల అవగాహన, అప్రమత్తత చాలా ముఖ్యం. సకాలంలో దీనిని గుర్తించడం, చికిత్స చేయడం ద్వారా ఈ వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చు.
మంకీపాక్స్ ఒక తీవ్రమైన వైరస్. అయితే సరైన అప్రమత్తతతో దీనిని నివారించడం సాధ్యమవుతుంది. ఎం పాక్స్ కు సంబంధించి ఏవైనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించి అవసరమైన చికిత్స తీసుకోవాలి. ముందస్తుగా గుర్తించడం వల్ల ఆయా వ్యాధి తీవ్రతను నివారించవచ్చు. అంతేకాదు ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా చేయవచ్చు.
ఇది కూడా చదవండి..మోకాళ్ల నొప్పులు తగ్గాలంటే ఎలాంటి యోగాసనాలు చేయాలి..?
ఇది కూడా చదవండి..ఈ సీజన్ లో తినకూడని ఆహారాలివే..
ఇది కూడా చదవండి..పోషకాహార లోపాన్ని ఎలా గుర్తించాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
