Vitamin : విటమిన్ "డి" లోపాన్ని నివారించడానికి చిట్కాలు..

షేర్ చేయండి:
Vitamin : విటమిన్ "డి" లోపాన్ని నివారించడానికి చిట్కాలు..

సాక్షి లైఫ్ : విటమిన్ "డి".. అనేది మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా ఇందరికీ అవసరమే. ఆధునిక జీవనశైలిలో చాలా మంది విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. దీని వల్ల ఎముకల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే, కొన్ని సులువైన మార్గాలను పాటించడం ద్వారా ఈ లోపాన్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ది కూడా చదవండి..గుండె నొప్పిని ఎలా గుర్తించవచ్చు..?

 ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పనస పండు..

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..  

ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు కనీసం 30 నిమిషాలు సూర్యరశ్మిలో ఉండాలి. ఇది విటమిన్ డి ఉత్పత్తి పొందడానికి సహాయపడుతుంది.

చేపలు (సాల్మన్, ట్యూనా, మాకేరెల్), గుడ్డు పచ్చసొన, పాలు, పెరుగు, జున్ను వంటి బలవర్థకమైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు నారింజ, పుట్టగొడుగులు కూడా తీసుకోవచ్చు.

డాక్టర్ సలహా మేరకు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యుడి సలహా లేకుండా సప్లిమెంట్లు తీసుకోవడం అనేది అనేక అనారోగ్యప్రమాదాలకు దారితీస్తుంది.

మహిళల్లో విటమిన్-డి లోపాన్నిఅధిగమించడం ఆరోగ్య రీత్యా అత్యంత ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే..  

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.