Allergies and Respiratory Problems : గోడలపై బూజుతో అలర్జీలు.. శ్వాసకోశ సమస్యలు..జాగ్రత్త..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : వర్షాకాలం వాతావరణాన్ని చల్లబరిచి మనస్సుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ, అదే సమయంలో ఎన్నో ఆరోగ్య సమస్యలను కూడా తీసుకువస్తుంది. ముఖ్యంగా వర్షాల తర్వాత ఇంట్లో గోడలు చెమ్మగిల్లి వచ్చే వాసనను ఏమాత్రం తేలికగా తీసుకోవద్దు. ఇది ఇంట్లో బూజు (fungus) ఏర్పడటానికి సంకేతం. దీనివల్ల అలర్జీలు, ఆస్తమా, ఇతర ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..చిన్నారులలో అరుదైన జన్యుపరమైన వ్యాధుల నిర్ధారణకు సరికొత్త రక్త పరీక్ష.. 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

ఇల్లు ఎందుకు చెమ్మగిల్లుతుంది..?

వర్షాకాలంలో గాలిలో తేమ శాతం విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లోకి తగినంత సూర్యరశ్మి రాకపోయినా, గాలి, వెలుతురు సరిగ్గా ప్రసరించకపోయినా గోడలు, పైకప్పు, మూసి ఉన్న గదుల్లో గాలి స్తంభించిపోయి తేమ పేరుకుపోతుంది. ఈ తేమ కారణంగానే ఫంగస్ వేగంగా వృద్ధి చెంది, ఇంట్లో నుంచి ఒక రకమైన ముక్కిపోయిన వాసన (Seelan) వస్తుంది.


ఫంగస్ వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలు.. 

ఇంట్లో ఏర్పడే ఈ ఫంగస్ వల్ల గాలిలో సూక్ష్మక్రిములు చేరి, శ్వాస ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కింది సమస్యలు తలెత్తవచ్చు.. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం, ఛాతీలో బిగుతుగా అనిపించడం.  విపరీతమైన తుమ్ములు రావడం, ముక్కు దిబ్బడ వేయడం లేదా ముక్కు కారడం.

కంటి సమస్యలు..కళ్లలో దురద, కళ్లు ఎర్రబడటం, నీరు కారడం.

గొంతు ఇన్ఫెక్షన్..గొంతు గరగర, ఎడతెగని పొడి దగ్గు.

ఆస్తమా ముప్పు: ఆస్తమా రోగుల్లో ఎటాక్ వచ్చే ప్రమాదం పెరగడం.

దీర్ఘకాలిక ప్రభావం..ఎక్కువ కాలం పాటు ఫంగస్ ప్రభావానికి గురైతే ఊపిరితిత్తుల పనితీరు మందగించడం.

ఎవరికి ముప్పు ఎక్కువ..?

ఈ ఫంగస్ ప్రభావం సాధారణ వ్యక్తుల పైనా పడవచ్చు. కొంతమందిలో దీని ముప్పు మరింత ఎక్కువగా ఉంటుంది.

ఆస్తమా, డస్ట్ అలర్జీలతో బాధపడేవారు.

చిన్నపిల్లలు, వయసు పైబడిన వృద్ధులు.

రోగనిరోధక శక్తి (immunity) తక్కువగా ఉన్నవారు.

దీర్ఘకాలిక శ్వాసకోశ, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు. తేమ, బూజు ఉన్న ప్రదేశాల్లో ఎక్కువ సమయం గడపకుండా జాగ్రత్త పడాలి.

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి..?

ఇంట్లో చెమ్మ లేదా బూజు ఉన్న వాతావరణంలో ఉన్నప్పుడు.. ఎడతెగని దగ్గు, శ్వాస తీసుకోవడంలో కష్టం, ఛాతీ పట్టేసినట్లు ఉండటం, పదే పదే తుమ్ములు రావడం వంటి అలర్జీ లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా ముందే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పటికప్పుడు ఇంటిని పొడిగా, గాలి వెలుతురు వచ్చేలా ఉంచుకోవడం వర్షాకాలంలో చాలా ముఖ్యం. 

 

ఇది కూడా చదవండి..Cholesterol : కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచే అద్భుతమైన అలవాట్లు.. మందులతో పనే లేదు..!

ఇది కూడా చదవండి..Pimples : ముఖంపై పదే పదే మొటిమలు వేధిస్తున్నాయా..? ఐతే లోపం చర్మంలో కాదు, శరీరంలోనే..!

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి.. టీబీని సకాలంలో గుర్తించకపోతే ఏమౌతుంది..? 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.