స్ట్రోక్‌ను నిరోధించే 6 అంశాలు..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : గతంలో 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో కేవలం 5శాతం స్ట్రోకులు మాత్రమే వచ్చేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 10 నుంచి 15శాతానికి పెరిగింది. అటువంటి వారిలో ఎక్కువగా 30 ఏళ్ల వయస్సులోపు  ఉన్న వ్యక్తులు కూడా ప్రభావితమవుతున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్ర లేమి, అనారోగ్యకరమైన ఆహారాలు, ఎక్కువ సేపు స్క్రీన్ పై గడపడం వంటి ప్రధాన కారణాలవల్లే స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని ఇటీవల జరిగిన అనేక అధ్యయనాలు వెల్లడించాయి.  

కొలెస్ట్రాల్, మధుమేహం.. 

అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ ,మధుమేహం వంటి పరిస్థితులను పర్యవేక్షించడానికి రెగ్యులర్ గా హెల్త్ చెకప్‌ చేయించాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. “కల్తీ ఆహారం, అధిక మొత్తంలో నూనె వంటకాలు, నెయ్యి, చక్కెర పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్ కొలెస్ట్రాల్ స్థాయిలను విపరీతంగా పెంచుతాయి. ఇది స్ట్రోక్ ప్రమాదానికి కారణమవుతుంది. దీనిని ఎదుర్కోవడానికి సమతుల్య ఆహారం చాలా అవసరమని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. 

 

దంతాల పొడవు తగ్గించడానికి ఏమి చేస్తారు..?

రూట్ కెనాల్ విధానంలో ఏయే దశలు ఉంటాయి..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు

చిన్న మార్పులు, పెద్ద ప్రభావం.. 

సాధారణ జీవనశైలి సర్దుబాట్ల ద్వారా 70శాతం వరకు స్ట్రోక్‌లను నివారించవచ్చని  వైద్యనిపుణులు చెబుతున్నారు. అందుకోసం జీవన శైలిలో మార్పులు చేసుకోవాలని వెల్లడిస్తున్నారు. అందులో భాగంగా  ప్రతి రోజూ 30 నిమిషాల నడక, ఉప్పు,చక్కెర తక్కువగా ఉన్న సమతుల్య ఆహారం, ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం, శరీరానికి తగినన్ని నీళ్లు తీసుకోవడం, కంటినిండా నిద్ర, సాధారణ వ్యాయామం స్ట్రోక్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

ఆకస్మికంగా తలెత్తే సమస్యలు, దృష్టి లోపించడం, ముఖం ఓ పక్కకు లాగినట్టు అనిపించడం, చేతులు బలహీన పడడం లేదా మాట్లాడడంలో ఇబ్బంది వంటి లక్షణాలు స్ట్రోక్ వచ్చే ముందు కనిపిస్తాయి. సంకేతాలను గుర్తించిన తర్వాత "స్ట్రోక్ తర్వాత మొదటి నాలుగున్నర గంటలలో చికిత్స అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. 

 

ఇది కూడా చదవండి..కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.