గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది..?
సాక్షి లైఫ్ : ఆకు కూరలలో విటమిన్ "కె "తోపాటు నైట్రేట్లు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటును తగ్గించడంలోను, ధమనుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తక్కువ. అంతేకాదు కొలెస్ట్రాల్ ను నియంత్రించే పలురకాల పోషకాలు ఆకు కూరల్లో ఉంటాయి.
శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని పెంచుతాయి. తృణధాన్యాలు మాత్రం గుండె ను సంరక్షిస్తాయి. బెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వాటిని తినడం వల్ల గుండె జబ్బులకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. కాబట్టి స్ట్రాబెర్రీస్, బ్లూ బెర్రీస్ వంటివి తప్పనిసరిగా తినాలి.
ఇది కూడా చదవండి..బరువు తగ్గడానికి అడపా దడపా ఉపవాసం ఆరోగ్యకరమైనదేనా..?
ఇది కూడా చదవండి..వెరికోస్ వెయిన్స్ కు శాశ్వత పరిష్కారం ఏమిటి..?
ఇది కూడా చదవండి..శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే నువ్వులు..
కొవ్వు చేపలు, చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తపోటు, ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్‌తో సహా గుండె జబ్బుల ప్రమాద కారకాలను తగ్గించడంలో సహాయపడుతాయి.
కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెజర్ ను తగ్గించడంలో వాల్‌నట్స్ ఎంతగానో సహాయపడతాయి. అంతేకాదు గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ తగ్గాలంటే వీటిని అస్సలు తినకండి..
ఇది కూడా చదవండి..ఫస్ట్ యాంటీబయాటిక్ స్మార్ట్ సెంటర్..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
