కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ కు కారణాలు..? పరిష్కారాలు ఏమిటి..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొన్ని దశాబ్దాల క్రితం వరకు గుండె సంబంధిత సమస్యలు కేవలం అరవై ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా వచ్చేవి. కానీ ఇప్పుడు వయస్సుతో సంబంధం లేకుండానే హార్ట్ ప్రోబ్లమ్స్ వస్తున్నాయి. రోజు రోజుకీ గుండె జబ్బులు ప్రాణాంతకమైన వ్యాధులుగా మారుతున్నాయని, కాబట్టి గుండె విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గుండె అనేది మనిషి శరీరంలో అత్యంత కీలకమైన అవయవం. కాబట్టి ప్రతి ఒక్కరికీ గుండె ఆరోగ్యం చాలా ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా గుండె జబ్బుల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

హృదయ సంబంధ వ్యాధులు (సివిడి) కార్డియో వాస్క్యూలర్ డిసీజెస్ అంటారు. ఈ వ్యాధులకారణంగా 2019లో ప్రపంచవ్యాప్తంగా 17.9 మిలియన్ల మంది మరణించారని అంచనా. ఈ మరణాలలో 85శాతం హార్ట్ ఎటాక్ , హార్ట్ స్ట్రోక్ కారణంగా సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలతోపోలిస్తే వెనుకబడిన దేశాల్లోనే గుండె జబ్బుల కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కలు వెల్లడిస్తున్నాయి.

ఎలాంటి వారిలో ఎక్కువ..? 
 
 గుండె జబ్బులు వయసుతో సంబంధం లేదని, ఎవరికైనా వస్తాయని, అందుకే చిన్నప్పటి నుంచి జీవనశైలి, ఆహారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  ఊబకాయం, షుగర్ వ్యాధిగ్రస్తులు, హైబీపీ ఉన్నవారు, పొగతాగేవారు, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునేవాళ్ళకు గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. రోజులో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని జాబ్ చేసేవారు, జంక్ ఫుడ్,  ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకునేవాళ్ల గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. 


రాకుండా ఎలాంటి జాగ్రత్తలు అవసరం..? 

- ఉప్పు, చక్కెరతోపాటు కొవ్వు పెంచే ఉత్పత్తులు తీసుకోకూడదు.
- మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం చాలా మంచిది.  
-40 ఏళ్ల వయస్సు తర్వాత, కొన్ని పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవాలి. 
-తద్వారా ప్రమాదాలను గుర్తించడం సాధ్యమవుతుంది. 
- ఫాస్ట్ ఫుడ్, కల్తీ ఆహారం, డ్రగ్స్‌ వంటి వాటికి దూరంగా ఉండాలి.
- ప్రతిరోజూ గంటసేపు నడవాలి, బరువు కూడా తగ్గించుకోవాలి.
-ప్రతిరోజూ సరిపడా నిద్ర అవసరం.  
- ఛాతీ నొప్పిగా అనిపిస్తే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేయించుకోవడం ఉత్తమం.
-ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. అందుకు తగినవిధంగా వ్యాయామం చేయాలి. 
-రక్తంలో 200 mg/dL కొలెస్ట్రాల్ స్థాయి సాధారణమైనదిగా పరిగణిస్తారు. 239 mg/dL అంతకంటే ఎక్కువగా ఉంటే అది గుండెకు హానికరంగా భావిస్తారు.

 

ఇది కూడా చదవండి..లిపోప్రోటీన్ గ్లోమెరులోప‌తి అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..ఆర్థరైటిస్ చికిత్సలో స్టెమ్ సెల్ థెరపీని ఉపయోగించడంలో ఎలాంటి సవాళ్లు ఉన్నాయి?.. 

ఇది కూడా చదవండి..మీ కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి 7 మార్గాలు

ఇది కూడా చదవండి..అల్లోపతి, యునాని చికిత్సా విధానాల మధ్య ముఖ్యమైన తేడాలు ఏమిటి?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.