మధుమేహం నియంత్రణలో ఉండాలంటే..? ఏమేం చేయాలి..?
సాక్షి లైఫ్ : షుగర్ ను అదుపులో ఉంచుకోవాలంటే తీపి పదార్థాలు తినడం మానుకోవాలి. అదేవిధంగా అవసరమైన మందులు వాడాలి. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకున్న తర్వాత కూడా చక్కెర స్థాయిలు అదుపులో ఉండడం లేదని కొందరు చేబుతూ ఉంటారు. ఇది కొన్ని తప్పుల వల్ల జరుగుతుంది. జీవనశైలిలో కొన్నిరకాల మార్పులు, జాగ్రత్తలు పాటించినప్పటికీ మధుమేహం ఎందుకు నియంత్రణలో ఉండదు. అందుకు కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
డయాబెటిస్ అనేది ఈ రోజుల్లో చాలా వేగంగా పెరుగుతున్న వ్యాధి. వృద్ధులే కాదు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇది ఒక సాధారణ సమస్యగా మారింది. షుగర్ విషయంలో రక్తంలో ఉండే చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండవు. దీని కారణంగా రోగికి అనేక ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
ఇది కూడా చదవండి..డయాబెటీస్ బయోబ్యాంకు వల్ల ప్రయోజనాలు ఏంటి..?
ఇది కూడా చదవండి..చలికాలంలో మెదడు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
సమయానికి భోజనం..
మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. రోగికి ఉదయం భోజనం చాలా ముఖ్యమైనది. రోజు రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా రోగి తీసుకునే అల్పాహారంపై ఆధారపడి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిద్రలేచిన గంటలోపు ఏదైనా తినాలి.
అంతే కాకుండా లంచ్, డిన్నర్ సమయానికి తీసుకోవాలి. డయాబెటిక్ పేషెంట్లు భోజనంతో సంబంధం లేకుండా ఏదైనా ఆరోగ్యకరమైన తినాలి. భోజనానికి మధ్య ఎక్కువ సమయం ఉండడం వల్ల మధుమేహం పెరుగుతుందని గుర్తుంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
టైమ్ కి మందులు..
మధుమేహం ఉన్నవాళ్లు అందుకు సంబంధించిన మందులను సమయానికితీసుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయంలో ఔషధాన్ని తీసుకోవాలి. అంతే కాకుండా ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే వారు డాక్టర్ సూచించిన సమయానికి తప్పనిసరిగా తీసుకోవాలి.
వ్యాయామంపై శ్రద్ధ..
డయాబెటిక్ ఉన్నవాళ్లు ప్రతిరోజూ వ్యాయామం చేయాలి.. ఎక్సర్ సైజ్ చేయడం వల్ల శరీరరంలో కేలరీస్ ఖర్చవుతాయి. దీని కారణంగా శరీరంలోని షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. వీలైనంత వరకు వ్యాయామం చేయాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఎక్కవ సేపు వ్యాయామం చేయలేకపోయినా రోజుకి కానీసం 30నిమిషాల పాటు నడవాలని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. ఓరల్ క్యాన్సర్ కు కారణాలు..?
ఇది కూడా చదవండి..సహజంగా ఆక్సిటోసిన్ పెంచడానికి మార్గాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
