డయాబెటీస్ బయోబ్యాంకు వల్ల ప్రయోజనాలు ఏంటి..?
సాక్షి లైఫ్ : భారతదేశంలో 11 కోట్ల మందికి పైగా మధుమేహ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎమ్ డిఆర్ ఎఫ్) ఛైర్మన్ డాక్టర్ వి.మోహన్ మాట్లాడుతూ, “డయాబెటీస్ బయోబ్యాంక్ ఏర్పాటుచేయడం ద్వారా మధుమేహం కారణాలు, భారతీయులను ప్రభావితం చేసే వివిధ రకాల మధుమేహం, దాని సంబంధిత రుగ్మతలపై పరిశోధనలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) దేశంలోని డయాబెటిస్‌కు సంబంధించిన రక్త నమూనాలను కలిగి ఉంటుంది.
2008 నుంచి 2020 వరకు అనేక దశల్లో భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలోని చిన్న వయస్సులో మధుమేహం ఉన్న వ్యక్తుల డేటా, ప్రారంభ దశలో ఉన్న వారి వివరాలు సేకరించారు.
టైప్ 1, టైప్ 2 ,గర్భధారణ మధుమేహం వంటి యువతలో వివిధ రకాల మధుమేహ సమస్యకు కారణాలు తెలుసుకోవడానికి వారి రక్త నమూనాలను సేకరించి పరిశోధన కోసం స్టోర్ చేసినట్లు డాక్టర్ మోహన్ చెప్పారు.
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..అమెరికాలో కొత్త వ్యాధి.. నేరుగా మెదడుపై ప్రభావం..
డయాబెటీస్ బయోబ్యాంకు ఏర్పాటు ప్రక్రియ రెండేళ్ల క్రితం ప్రారంభ మైంది. బయోబ్యాంక్ వివరాలను, దాని ఏర్పాటు ఉద్దేశాన్ని గత వారం ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో ప్రచురించిన కథనంలో వివరించారు. ప్రపంచంలోని వివిధ బయోబ్యాంక్‌లలో, బ్రిటన్‌కు చెందిన బయోబ్యాంక్ అత్యంత ప్రసిద్ధమైనది. ఇందులో ఐదు లక్షల మంది వ్యక్తుల జన్యు, జీవనశైలి, ఆరోగ్య సమాచారాన్ని కలిగి ఉన్న బయోమెడికల్ డేటా ఉంది.
ఇది కూడా చదవండి..చలికాలంలో మెదడు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
