చలికాలంలో మెదడు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది..?
సాక్షి లైఫ్ : మన శరీరంలోని ప్రతి కణానికి కాలానికి సంబంధించిన సమాచారం అవసరం. తద్వారా అది పగలు- రాత్రి ప్రకారం సరిగ్గా పని చేస్తుంది. నోటి ఎగువ భాగంలోని ప్రత్యేక న్యూరాన్లు (సుప్రాచియాస్మాటిక్ న్యూక్లియస్) గడియారం లాగా, శరీరంలోని ఇతర కణాలకు పగలు- రాత్రి గురించి చెబుతాయి.
మెదడు..
సూర్యరశ్మి మెదడుకు నేరుగా చేరదు. కాకపోతే మన కళ్ళ వెనుక భాగంలో మెలనోప్సిన్ గ్యాంగ్లియన్ కణాలు అని పిలిచే ప్రత్యేక రకమైన కణాలు ఉన్నాయి. ఇవి సూర్యరశ్మికి స్పందిస్తూ ఉంటాయి. పగలు- రాత్రి గురించి మెదడుకు తెలియజేస్తాయి.
ఇది కూడా చదవండి..శీతాకాలంలో ముల్లంగి ఆకులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..యూరిక్ యాసిడ్ అంటే ఏమిటి..? ఇది ఎంత ఉంటే నార్మల్..?
ఇది కూడా చదవండి..ఒత్తిడిని నివారించాలంటే ఎంత సమయం నడవాలి..?
మెదడు మెలకువగా, చురుకుగా ఉండటానికి సూర్యరశ్మి చాలా ముఖ్యం. కంటి చూపులేని వారికి కూడా, ఉదయం పూట కాంతి అవసరసం. తద్వారా మెదడు పగలు, రాత్రి సరైన ఆలోచనను పొందగలదు. తదనుగుణంగా శరీరం మిగిలిన పనులను నిర్వర్తిస్తుంది.
సరైన సూర్యరశ్మి..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనస్తత్వవేత్తలు సూర్యరశ్మి మన మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిద్ర, చురుకుదనంపై సూర్యకాంతి అత్యధిక ప్రభావాన్ని చూపుతుందని "స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలోని న్యూరోబయాలజీ ప్రొఫెసర్ ఆండ్రూ హుబెర్‌మాన్" చెబుతున్నారు. మనం ఉదయం నిద్ర లేవగానే సూర్యరశ్మిని గ్రహించినా చూడకున్నా రాత్రిపూట నిద్రపై ప్రభావం కచ్చితంగా చూపుతుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. దీని కారణంగా శీతాకాలంలో కొంతమందిలో డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయని, దీనిని వింటర్ డిప్రెషన్ లేదా సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్ "అంటారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
