డింగా డింగా వ్యాధి లక్షణాలు ఇవే..
సాక్షి లైఫ్ : ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో "డింగా డింగా" అనే ఓ రకమైన వ్యాధి మహిళలు, బాలికలను ప్రభావితం చేస్తోంది. ఈ వ్యాధి వచ్చిన వారిలో వణుకు, నడవడానికి ఇబ్బందిగా అనిపించడంతోపాటు జ్వరం, బలహీనత వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు 300 మందికి పైగా బాధితులు ఈ "డింగా డింగా" వ్యాధి బారిన పడ్డారు.
అయితే "డింగా డింగా" వ్యాధికి ప్రధాన కారణాలు ఏమిటి..? ఎలాంటివారికి ఏ వ్యాధి వస్తుంది..? అనేదానిపై ఆరోగ్య శాఖఅధికారులు, పరిశోధకులు గుర్తించే పనిలో పడ్డారు. ఈ వ్యాధికి యాంటీబయాటిక్స్ పనిచేస్తున్నాయని సక్సెస్ రేటు కూడా ఎక్కువగానే ఉందని అక్కడి వైద్య శాఖా అధికారులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
"డింగా డింగా" డిసీజ్ రాకుండా ఉండేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఇంకా అధికారులు వెల్లడించలేదు.. ప్రస్తుతానికి ఈ వ్యాధికి ఖచ్చితమైన కారణం తెలియదుకాబట్టి. వణుకు, నడవడంలో ఇబ్బందిగా అనిపించడం, జ్వరం, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని అధికారులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..చర్మ సంబంధిత సమస్యలు ఎలాంటివాళ్లలో ఎక్కువగా వస్తాయి..?
ఇది కూడా చదవండి..లిప్ స్టిక్ వాడుతున్నారా..? అయితే జాగ్రత్త..
ఇది కూడా చదవండి..జననేంద్రియాలు శుభ్రంగా లేకపోవడం వల్ల కలిగే సాధారణ అంటువ్యాధులు ఏమిటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
