మెదడులో కణితులు ఎందుకు వస్తాయి..?

షేర్ చేయండి:
మెదడులో కణితులు ఎందుకు వస్తాయి..?

సాక్షి లైఫ్ : చాలా మందికి తలనొప్పి తరచుగా వస్తుంటుంది. అది తీవ్రంగా మారినప్పుడు, "మెదడులో ఏదైనా కణితి ఉందేమో?" అనే ఆందోళన కలగడం సహజం. అయితే, తీవ్రమైన తలనొప్పి మెదడు కణితులకు కారణం కాదు అని ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ వి. బ్రహ్మ ప్రసాద్ స్పష్టం చేస్తున్నారు. తలనొప్పి అనేది మెదడు కణితికి ఒక లక్షణం మాత్రమే తప్ప, మెదడు కణితులు ఎందుకు వస్తాయనే దానిపై పూర్తి స్పష్టత లేనప్పటికీ, కొన్ని ముఖ్యమైన అంశాలు ప్రమాద కారకాలుగా గుర్తించవచ్చని ఆయన వెల్లడిస్తున్నారు.

ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

 

మెదడు కణితులు అంటే మెదడులోని కణాలు అసాధారణంగా, నియంత్రణ లేకుండా పెరిగి ఒక గడ్డగా మారడం. ఈ కణాల పెరుగుదల వెనుక ఖచ్చితమైన కారణాలు చాలావరకు తెలియవు. అయితే, కొన్ని అంశాలు మెదడు కణితులు వచ్చే ప్రమాదాన్ని పెంచుతాయి.. అటువంటి వాటిలో.. 

జన్యుపరమైన కారణాలు..  

చాలా తక్కువ శాతం (5-10% కంటే తక్కువ) మెదడు కణితులు వంశపారంపర్యంగా వచ్చే కొన్ని జన్యుపరమైన సిండ్రోమ్‌లతో సంబంధం కలిగి ఉంటాయి. ఉదాహరణకు, న్యూరోఫైబ్రోమాటోసిస్ 1 & 2 (NF1, NF2), ట్యూబరస్ స్క్లెరోసిస్ కాంప్లెక్స్ వంటివి.

అధిక మోతాదు రేడియేషన్.. 

తలకు గతంలో క్యాన్సర్ చికిత్సలో భాగంగా అధిక మోతాదులో రేడియేషన్ థెరపీ తీసుకున్నవారిలో మెదడు కణితులు వచ్చే ప్రమాదం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. అయితే, మొబైల్ ఫోన్‌లు లేదా సాధారణ ఎక్స్-రేల వంటి తక్కువ స్థాయి రేడియేషన్ వల్ల మెదడు కణితులు వస్తాయని ఇప్పటివరకు కచ్చితమైన ఆధారాలు లేవు.

వయస్సు విషయంలో..  

మెదడు కణితులు ఏ వయసులోనైనా రావొచ్చు. అయితే, కొన్ని రకాల కణితులు పెద్దలలో, మరికొన్ని పిల్లలలో ఎక్కువగా కనిపిస్తాయి.

బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ.. 

HIV/AIDS వంటి వ్యాధులు ఉన్నవారికి లేదా అవయవ మార్పిడి చేయించుకుని రోగనిరోధక శక్తిని తగ్గించే మందులు వాడేవారికి కొన్ని రకాల మెదడు కణితులు (లింఫోమాస్) వచ్చే అవకాశం ఎక్కువ.
శరీరంలోని ఇతర క్యాన్సర్‌లు (మెటాస్టాసిస్):

చాలా సందర్భాలలో, మెదడు కణితులు ప్రాథమికంగా మెదడులో పుట్టవు. ఇవి శరీరం లోని ఇతర భాగాలలో (ఉదాహరణకు, ఊపిరితిత్తులు, రొమ్ము, మూత్రపిండాలు, చర్మ క్యాన్సర్ (మెలనోమా), పెద్దప్రేగు) క్యాన్సర్ ప్రారంభమై మెదడుకు వ్యాపించినప్పుడు (మెటాస్టాసిస్) వస్తాయి.

 

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..?

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.