శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : మానవ శరీరం అనేక సంక్లిష్ట ప్రక్రియలతో రూపొందింది. ముఖ్యంగా మానవ శరీరం నిర్మాణంలో మిలియన్ల కణాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? వ్యాధులను నివారించడంలో రక్తం ఏమి చేస్తుంది..? రక్తంలో వివిధ రంగుల కణాలు ఉన్నాయి..? వాటి రంగులాగే, వాటి పని కూడా భిన్నంగా ఉంటుంది. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల చాలా తేడా ఉంటుంది.
ఇది కూడా చదవండి.. ఆక్యుపంచర్ చికిత్సలో సైడ్ ఎఫెక్ట్స్..?
ఇది కూడా చదవండి.. ఒబెసిటీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి..?
రక్తం ఎర్రగా ఉండడానికి..
మనిషి రక్తంలో హిమోగ్లోబిన్ ఉంటుంది. ఇది ఒకరమైన ప్రోటీన్. హిమో గ్లీబిన్ ఐరన్ కలవడం వల్ల రక్తం ఎర్రగా మారుతుంది. హిమోగ్లోబిన్ లో ఉండే ఐరన్ ఆక్సిజన్‌తో చర్య జరుపుతుంది. తద్వారా రక్తం ఎరుపు రంగులోకి మారుతుంది.
శరీరం నిర్మాణంలో..
మన శరీరంలోని రక్తం ఎందుకు ఎర్రగా కనిపిస్తుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? శరీరాన్ని సజావుగా నడపడంలో రక్తం పాత్ర ఏమిటి..? వ్యాధులను నివారించడంలో రక్తం ఏమి చేస్తుంది? శరీరంలోని వివిధ భాగాలలో ఎర్రరక్త కణాలు, తెల్లరక్త కణాలు ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి. తెల్లరక్త కణాలు వీటినే రెడ్ బ్లడ్ సెల్స్ (ఆర్బీసీ) అని కూడా అంటారు. తెల్లరక్త కణాలు వీటిని వైట్ బ్లడ్ సెల్స్ అని (డబ్ల్యూ బీసీ) అని కూడా అంటారు.
రక్త కణాలు..
మానవ శరీరంలో దాదాపు ఐదు లీటర్ల రక్తం ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్త కణాలు (ఆర్బీసీ), తెల్ల రక్త కణాలు (డబ్ల్యూబీసీ) ఉంటాయి. రెండూ మన శరీరంలో ముఖ్యమైన విధులను కలిగి ఉంటాయి. శరీరంలోని వివిధ భాగాల కణజాలాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్లడంలో ఎర్ర రక్త కణాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే తెల్ల రక్త కణాలు ప్రతిరోధకాలను తయారు చేయడం ద్వారా శరీర రక్షణ వ్యవస్థలో సహాయపడతాయి.
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
