గుండె ఆరోగ్యం కోసం తప్పనిసరిగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?
సాక్షి లైఫ్ : మహిళలు గుండెపోటు లక్షణాలను గుర్తించి, సకాలంలో చికిత్స తీసుకోవడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా గుండె జబ్బుకు సంబంధించిన లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్య నిపుణులను సంప్రదించడం ద్వారా ప్రాణాలను కాపాడుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. అందుకోసం ఏమేం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు ఎక్కువగా ఉండే సమతుల్య ఆహారం తీసుకోవాలి. కొవ్వు పదార్థాలు, ఉప్పు, చక్కెర వినియోగాన్ని తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం: ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు నడక, యోగా, సైక్లింగ్ వంటి వ్యాయామాలు చేయాలి.
ఒత్తిడిని తగ్గించుకోవడం: యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, పుస్తకాలు చదవడం లేదా ఇష్టమైన హాబీలను కొనసాగించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.తగినంత నిద్ర: రోజుకు 7 నుంచి 8 గంటలు నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.ధూమపానం, మద్యం మానేయాలి : ధూమపానానికి పూర్తిగా స్వస్తి చెప్పాలి. మద్యపానాన్ని పరిమితం చేయాలి లేదా పూర్తిగా మానేయాలి.
క్రమంతప్పని ఆరోగ్య పరీక్షలు: రక్తపోటు, కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించుకోవాలి. వైద్యుల సలహా మేరకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు..
ఇది కూడా చదవండి..బేబీ వాకర్స్ తో పిల్లలు వేగంగా నడవగలుగుతారా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
