ఎలాంటి అలవాట్లు ఫ్యాటీలివర్ కు కారణమవుతాయి..?
సాక్షి లైఫ్ : ఫ్యాటీలివర్ ప్రమాదకరమైంది. కానీ పలురకాల అలవాట్లకు దూరంగా ఉండడం ద్వారా ఆయా సమస్య బారి నుంచి బయట పడొచ్చు. కొన్నిరకాల జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పలు వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉండొచ్చు. ప్రతి వ్యాధికి కొన్ని సంకేతాలు లేదా లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. అదేవిధంగా ఆయా లక్షణాలను బట్టి వ్యాధి రాకుండా జాగ్రత్త పడొచ్చు. ఫ్యాటీలివర్ కు కారణమయ్యే కొన్ని కారకాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..వర్షం పడినప్పుడు జలుబు, దగ్గు ఎందుకు వస్తాయి..?
ఇది కూడా చదవండి..దీర్ఘకాలిక వ్యాధులు రాకుండాఉండాలంటే..? ఏమి చేయాలి..?
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో నివారించాల్సిన ఆహారాలు, కూరగాయలు
నిశ్చల జీవనశైలి..
మీరు ఆఫీసులో లేదా ఇంట్లో ఎక్కువ సమయం కూర్చుని పని చేస్తూ ఉంటే, ఫ్యాటీలివర్ వచ్చే అవకాశం ఉంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. అంతేకాదు శరీరంలోపల కొవ్వు పెరిగి పోతుంది. కొవ్వు శరీరంలో జరిగే జీవక్రియకు ఆటంకం కలిగిస్తుంది, ఇది కాలక్రమేణా కాలేయాన్ని దెబ్బతీస్తుంది.
ఫాస్ట్ ఫుడ్..
క్రమం తప్పకుండా ఫాస్ట్ ఫుడ్స్ తినడం చాలా మంచిది కాదు. ఫాస్ట్ ఫుడ్‌లో కొవ్వు, చక్కెర , శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల కాలేయం ఒత్తిడికి గురై కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.
అతిగా మద్యపానం సేవించడం..
క్రమం తప్పకుండా మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఆల్కహాల్ జీవక్రియను అడ్డుకుంటుంది. ఆల్కహాల్ అధిక వినియోగం కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది ఫ్యాటీ లివర్ వ్యాధికి దారి తీస్తుంది.
వ్యాయామం లేకపోవడం..
ఆహారం మాత్రమే కాదు, వ్యాయామం లేకపోవడం వల్ల కూడా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది. ఇది శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమవుతుంది.
ఆలస్యంగా భోజనం చేయడం..
రాత్రిపూట ఆలస్యంగా ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ప్రక్రియపై గణనీయమైన ప్రభావం చూపుతుంది. అర్థరాత్రి భోజనం చేయడం వల్ల సరిగా అరగదు. దీంతో అది కొవ్వుగా పేరుకుపోయే అవకాశం ఉంది. ఇది ఫ్యాటీ లివర్‌కి కారణమవుతుంది. కాబట్టి అర్థరాత్రి తినే అలవాటును మానుకోవడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..హార్మోనల్ ఇంబ్యాలెన్స్ విషయంలో అమ్మాయిలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
