ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏమిటి..?  

షేర్ చేయండి:
ఇస్కీమిక్ స్ట్రోక్ అంటే ఏమిటి..?  

సాక్షి లైఫ్ : పక్షవాతం, లేదా స్ట్రోక్, భారతదేశంలో మూడవ అతిపెద్ద మరణ కారణమని న్యూరాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఈ పరిస్థితికి తక్షణ వైద్యం అవసరమవుతుంది. ప్రత్యేకించి, పక్షవాతం వచ్చిన తరువాత, సకాలంలో ఆసుపత్రికి చేరుకున్నా, ఐదు గంటల్లోనే సరైన చికిత్స చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయట పడొచ్చు.  

పక్షవాతం రెండు రకాలుగా ఉంటుంది. మొదటి రకం, ఇస్కీమిక్ స్ట్రోక్, మెదడులో రక్తప్రసరణ అంతరాయంతో రక్తగడ్డలు ఏర్పడినప్పుడు వస్తుంది. ఇది అత్యంత సాధారణమైన రకం. ముఖ్యంగా పక్షవాతం రావడానికి ముందు లేదా తరువాత, నిదానంగా సంభవించే లక్షణాలు, వాటి ప్రాథమిక గుర్తింపు, తక్షణ వైద్యం ఏంటి అన్న అంశాలను గురించి తెలుసుకోవడం చాలా అవసరం.  

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడే న్యాచురల్ ఫుడ్..?

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతిని ఎలా నిర్మూలించవచ్చు..? 

ఇది కూడా చదవండి..డయాబెటిక్ న్యూరోపతి లక్షణాలను ఎలా గుర్తించాలి..? 

 

 రెండు రకాల స్ట్రోక్‌లు ఉన్నాయి. మొదటి రకం పక్షవాతం మెదడులో రక్తం గడ్డలు కట్టడం వల్ల వస్తుంది. దీనిని ఇస్కీమిక్ స్ట్రోక్ అని అంటారు.  
రెండవ రకం పక్షవాతం రక్త నాళాలు చిట్లిపోయి రక్త స్రావం జరగడం వల్ల వచ్చే స్ట్రోక్ ను హెమరేజిక్ స్ట్రోక్ అని అంటారు. స్ట్రోక్ కారణంగా, ఒక వైపున చేయి లేదా కాలు అకస్మాత్తుగా పనిచేయకపోవడం, నడవడంలో ఇబ్బంది, నోటిపై ప్రభావం పడడం వల్ల మాట్లాడటం లేదా తినడంలో ఇబ్బంది, చూపు మందగించడం, విపరీతమైన మైకము, తలనొప్పి , మూర్ఛ అనేది స్ట్రోక్ ప్రధాన లక్షణాలు. సమయానికి అవసరమైన వైద్య పరీక్షలు చేసి తగిన చికిత్స అందిస్తే పక్షవాతాన్ని నిర్మూలించవచ్చు.  

 

ఇది కూడా చదవండి..జ్ఞాపకశక్తి తగ్గుతోందా..? అయితే అది ఈ జబ్బుకు సంకేతం కావచ్చు.. 

ఇది కూడా చదవండి..చిన్న వయసులో కూడా అల్జీమర్స్ సమస్య వస్తుందా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.